Ram Charan and Game Changer Team Condolonces to Ramoji Rao: పత్రికా రంగంలో చెరగని ముద్ర వేసిన ఈనాడు సంస్థల అధినేత, దిగ్గజ పాత్రికేయులు రామోజీరావు గారి మరణం అత్యంత బాధాకరం అని గేమ్ ఛేంజర్ యూనిట్ పేర్కొంది. ఈ రోజు రాజమండ్రిలో గేమ్ ఛేంజర్ చిత్రీకరణ చేస్తున్న రామ్ చరణ్… రామోజీ రావు గారికి అశ్రు నివాళులు అర్పించారు. ఆయనతో పాటు దర్శకుడు శంకర్, నటులు సునీల్ రఘు కారుమంచి ఇతర చిత్ర బృంద సభ్యులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. రామోజీరావు గారి మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు అని తెలిపారు. నిన్న హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో హీరో రామ్ చరణ్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు.
Ramoji Rao: రామోజీరావు కోసం ఆస్కార్ రావాలని కోరుకున్న ఎం.ఎం.కీరవాణి.. ఎందుకో తెలుసా?
కోనసీమ జిల్లా బొబ్బర్లంకలో జరిగే “గేమ్ చేంజర్ “షూటింగ్ కోసం రాజమండ్రి చేరుకున్న రామ్ చరణ్ రాత్రి రాజమండ్రిలోనే బస చేశారు. బొబ్బర్లంకలో శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా నిర్మితమవుతోంది. మూడు రోజుల పాటు జరగనున్న సినిమా షూటింగ్ లో రామ్ చరణ్ పాల్గొంటారు. ఇక విమానాశ్రయంలో గజ మాలతో ఘన స్వాగతం పలికిన మెగా అభిమానులకు కార్లో నుంచి అందరికీ అభివాదం చేస్తూ రామ్ చరణ్ ముందుకు సాగారు. మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏడిద బాబీ, కోపల్లి శ్రీను ఇతర అభిమానులు పుష్పగుచ్చం అందజేశారు.రాజమండ్రి విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన షెల్టన్ హోటల్ కి రామ్ చరణ్ తేజ్ చేరుకున్నారు. మూడు రోజులు పాటు రాజమండ్రిలోనే రామ్ చరణ్ బస చేస్తారు.