Rakul Preet : హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. చాలా విషయాలపై స్పందిస్తూనే ఉంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఘాటు కామెంట్లు చేసింది. తనలోని అంసతృప్తిని మొత్తం బయట పెట్టేసింది. దేశంలో పనికి మాలిన వాళ్లు ఎక్కువయ్యారంటూ రియాక్ట్ అయింది. సినిమా సెలబ్రిటీల మీద తప్పుడు వార్తలు రాసేవారు.. సోషల్ మీడియాలో అబద్దపు పోస్టులు పెడుతూ ఎంజాయ్ చేసే వారంతా తన దృష్టిలో పనికిమాలిన వాళ్లే అంటూ సీరియస్ అయింది. ఫేక్ ఫొటోలు, ఫేక్ వీడియోలతో సెలబ్రిటీలపై చేస్తున్న ప్రచారాన్ని అందరూ ఖండించాలని కోరింది. ఆమె కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Read Also : Roshniwaliaa : మా అమ్మ శృంగారానికి ఫ్రీడమ్ ఇచ్చింది.. హీరోయిన్ బోల్డ్ కామెంట్స్
సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై ఏదో ఒక రకమైన పోస్టులు తరచూ చూస్తూనే ఉంటాం. అందులో కొన్ని మాత్రమే నిజం అవుతాయి.. చాలా వరకు ఫేక్ పోస్టులే ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇప్పుడు రకుల్ కూడా వాటిపై ఇలా రియాక్ట్ అయిందన్నమాట. రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ తో ఇమేజ్ సంపాదించుకుని తర్వాత బాలీవుడ్ వెళ్లిపోయింది. ప్రస్తుతం అక్కడే సినిమాలు చేస్తుంది. జాకీ భగ్నానీతో పెళ్లి అయినా సరే తన సినిమాలు చేయడం మాత్రం ఆపట్లేదు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఘాటుగా అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది ఈ ముద్దుగుమ్మ. ఆమె చేస్తున్న అందాల రచ్చకు బాగానే అభిమానులు ఉన్నారు.
Read Also : War 2 Event : విజయవాడలో వార్-2 ప్రీ రిలీజ్ ఈవెంట్.. క్లారిటీ..