Roshniwaliaa : ఈ నడుమ హీరోయిన్లు బోల్డ్ కామెంట్స్ చేస్తూ అటెన్షన్ లో ఉంటున్నారు. మరీ ముఖ్యంగా నార్త్ భామలు ఈ టైప్ బోల్డ్ కామెంట్స్ ఎక్కువగా చేస్తున్నారు. తాజాగా ఓ హీరోయిన్ అయితే ఏకంగా శృంగారంపై వాళ్ల అమ్మ ఫ్రీడమ్ ఇచ్చిందంటూ కామెంట్స్ చేసింది. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్ రోష్నివాలియా. హిందీలో ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు హీరోయిన్ గా మారి బోల్డ్ సినిమాలతో దూసుకుపోతోంది. ఎలాంటి బోల్డ్ సీన్లలో నటించడానికి అయినా అస్సలు వెనకాడదు ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఓ పాడ్ కాస్ట్ ప్రోగ్రామ్ లో పాల్గొంది. ఇందులో ఆమె మాట్లాడుతూ.. శృంగారంపై బోల్డ్ కామెంట్స్ చేసింది.
Read Also : Sukumar : రామ్ చరణ్ కోసం రంగంలోకి సుకుమార్.. అక్కడ కథ రాస్తున్నాడట..
నేను సినిమాల్లో నటించేందుకు మా అమ్మ ఎంతో సపోర్ట్ చేసింది. ఆమె వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. కేవలం కెరీర్ పరంగానే కాదు.. అన్ని విషయాల్లో మా అమ్మ మాకు ఫ్రీడమ్ ఇచ్చింది. శృంగారానికి కూడా ఎలాంటి అడ్డు చెప్పలేదు. ఎంజాయ్ చేయమని చెబుతుంది. కాకపోతే ప్రొటెక్షన్ వాడాలని పదే పదే జాగ్రత్త చెబుతుంది. నా కంటే ముందు మా అక్కకు కూడా ఇదే చెప్పేది. ఇప్పుడు నాకు చెబుతోంది. ఆమె మా కోసం అన్నీ వదిలేసుకుని ముంబైకి వచ్చింది. ఆమె త్యాగాల వల్లే ఈ రోజు హీరోయిన్ గా సినిమాలు చేస్తున్నాను. మా అమ్మ ఎప్పుడూ మాకు రూల్స్ పెట్టలేదు. లైఫ్ ను ఎంజాయ్ చేయమని చెబుతూ ఉంటుంది’ అని చెప్పుకొచ్చింది రోష్నివాలియా.
Read Also : War 2 Event : విజయవాడలో వార్-2 ప్రీ రిలీజ్ ఈవెంట్.. క్లారిటీ..