Rakul Preet Singh: అందుకే తెలుగు సినిమాలు చేయట్లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్లో బిజియెస్ట్ హీరోయిన్. ప్రతీ స్టార్ హీరో సినిమాలో కచ్ఛితంగా కనిపించేది. దర్శకనిర్మాతలందరూ ఈమె డేట్స్ కోసం క్యూలో నిల్చునేవారు. అలాంటి భామ ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి కనుమరుగైంది. చివరిసారిగా ‘కొండపొలం’ చిత్రంలో కనిపించిన ఈ అమ్మడి చేతిలో ప్రస్తుతం ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. ఓవైపు ఫ్యాన్స్ ఈమె కోసం వేచి చూస్తుంటే.. ఈ భామ మాత్రం హిందీ సినిమాలు చేసుకుంటూ బాలీవుడ్లోనే సెటిలైపోయింది. దీంతో.. రకుల్ టాలీవుడ్‌కి గుడ్‌బై చెప్పేసిందా? అనే ప్రచారం మొదలైపోయింది. కానీ, ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని రకుల్ తాజాగా తేల్చి చెప్పింది.
రీసెంట్గా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించిన రకుల్‌కి ఓ అభిమాని నుంచి తెలుగు సినిమాల విషయమై ఒక ప్రశ్న ఎదురైంది. ‘‘మీరు భవిష్యత్తులో తెలుగు సినిమాల్లో నటిస్తారా? లేక హిందీ చిత్రాలకే పరిమితం అయ్యారా?’’ అని ఆ ఫ్యాన్ ప్రశ్నించాడు. ఇందుకు రకుల్ బదులిస్తూ.. ‘‘నేను కచ్ఛితంగా తెలుగు సినిమాలు చేస్తాను. కాకపోతే నేను కొంచెం భిన్నంగా ఏదైనా చేయాలనుకుంటున్నాను. నాకు ఛాలెంజింగ్‌గా అనిపించే స్క్రిప్ట్ కోసం వేచి చూస్తున్నాను. అవును, ప్రస్తుతానికి హిందీ సినిమాలతో బిజీగా ఉన్నాను. నాకు ఎలాంటి భాషా బేధాలు లేవు. స్క్రిప్టే నాకు ముఖ్యం. నన్ను ఎగ్జైట్ చేసే స్క్రిప్ట్ వస్తే, తప్పకుండా సినిమా చేస్తా’’ అని చెప్పుకొచ్చింది. మరి, రకుల్ కోరుకునే ఆ ఛాలెంజింగ్ స్క్రిప్ట్ ఎప్పుడు దొరుకుతుందో? ఇందుకు కాలమే సమాధానం చెప్పాలి.
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
కాగా.. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో తెరంగేట్రం చేసిన రకుల్, అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఎన్నో భారీ ప్రాజెక్టుల్లో నటించి, కొన్నాళ్లు ఇండస్ట్రీలో చక్రం తప్పింది. ఇంతలో ఇతర భామల నుంచి తీవ్ర పోటీ నెలకొనడం, రకుల్ ఇటు బాలీవుడ్‌లోనూ దృష్టి సారించడంతో.. తెలుగులో ఆఫర్లు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం ఈ భామ హిందీలో డాక్టర్ జీ, థ్యాంక్ గాడ్ సినిమాలు చేస్తోంది. ఈ ఏడాదిలోనే ఇవి విడుదల కానున్నాయి.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు