NTV Telugu Site icon

Rakul Preet Singh: అవకాశాలు లేకపోయినా.. అన్ని కోట్లు పెట్టి కారు కొన్నదా.. ?

Rakul

Rakul

Rakul Preet Singh: వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న రకుల్.. వరుస అవకాశాలను కూడా అందుకుంది. స్టార్ హీరోలందరి సరసన నటించి .. స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపునే అందుకుంది. ఇక బాలీవుడ్ లో అవకాశాల కోసం చక్కనమ్మ కొద్దిగా చిక్కి.. జీరో సైజ్ కు వచ్చింది. ఇక అక్కడ కూడా వరుస అవకాశాలు అయితే వచ్చాయి.. కానీ, ఆశించిన విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. అయితే.. బాలీవుడ్ వలన రకుల్ కు ఒక బాయ్ ఫ్రెండ్ అయితే దొరికాడు. జాకీ భగ్నానీతో ఈ భామ ప్రేమలో పడడం, అది వారు అధికారికంగా ప్రకటించడం.. త్వరలోనే తమ పెళ్లి కూడా ఉంటుందని చెప్పడంతో రకుల్ అభిమానులు సంతోషించారు. ఇక గత ఏడాది నుంచి రకుల్ కు తెలుగులో ఆఫర్స్ లేవు అని చెప్పాలి. నిజం చెప్పాలంటే.. రకుల్ బక్కచిక్కి పోవడం తెలుగు ప్రేక్షకులకు అస్సలు నచ్చలేదు. ముద్దుగా, బొద్దుగా కనిపించే రకుల్.. ఇలా మారిపోవడంతో నెటిజన్స్ షాక్ అయ్యారు.

Pawan Kalyan: మన అంతరిక్ష చరిత్రలో సువర్ణ అధ్యాయం

ఇక ఇవన్నీ పక్కన పెడితే.. తాజాగా రకుల్ ఒక కొత్త కారును కొనుగోలు చేసింది. మెర్సిడెజ్‌ లో లేటెస్ట్ మోడల్ ను రకుల్ సొంతం చేసుకుంది. దీని విలువ సుమారు.. రూ. 3.50 కోట్లు ఉంటుందని సమాచారం. ఈ లగ్జరీ కారుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు ఔరా అంటున్నారు. అంత కాస్ట్లీ కారు కొనేంత డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది.. ఈ మధ్యకాలంలో అన్ని సినిమాలు కూడా చేయడం లేదుగా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం .. ఆమెకు సినిమాలతో ఏం పని.. వ్యాపారాలు బాగానే ఉన్నాయి కదా.. అందులో బాగా సంపాదిస్తోంది కావొచ్చు అంటూ సమర్థిస్తున్నారు. మెట్రో నగరాల్లో రకుల్.. జిమ్ లు నడుపుతున్న విషయం తెల్సిందే. ఏదిఏమైనా కాస్ట్లీ కారు సొంతం చేసుకున్నందుకు ఫ్యాన్స్ ఆమెకు కంగ్రాట్స్ చెప్తున్నారు.