Rakshasa Kavyam teaser: నవీన్ బేతిగంటి, అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి ప్రధాన పాత్రల్లో “రాక్షస కావ్యం” అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను గరుడ ప్రొడక్షన్స్, పింగో పిక్చర్స్, సినీ వ్యాలీ మూవీస్ బ్యానర్స్ లో దాము రెడ్డి, శింగనమల కల్యాణ్ నిర్మిస్తుండగా శ్రీమాన్ కీర్తి డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే షూట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా టీజర్ ను తాజాగా విడుదల చేశారు. ఈ క్రమంలో హీరో నవీన్ బేతిగంటి మాట్లాడుతూ నేను రామన్న యూత్ సినిమాకు డైరెక్షన్ చేస్తున్నప్పుడు చాలా మంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ నువ్వు డైరెక్షన్ చేస్తున్నావు కదా యాక్టింగ్ చేయవేమో అనుకున్నాం అని ఆఫర్స్ ఇవ్వడం మానేశారని కానీ నేను బేసిక్ గా యాక్టర్ ను, సినిమాల్లో నటించాలని కోరుకుంటానని అన్నారు.
Sreemukhi: మొన్న అలా, ఇప్పుడు ఇలా.. చూపిస్తూ కవ్విస్తే తట్టుకోవడం ఎలా శ్రీముఖీ?
దాము అన్న ద్వారా శ్రీమాన్ వచ్చి ఈ కథ చెప్పాడని, ఈ కథలో నేను ఏ క్యారెక్టర్ కోరుకున్నానో, అదే క్యారెక్టర్ నాకు ఇచ్చారని అన్నారు. నా లైఫ్ టైమ్ లో గుర్తుండే సినిమా అవుతుందని , ఇది ఒక డిఫరెంట్ మూవీ అని సినిమా చూశాక మీరే చెబుతారని అన్నారు. దర్శకుడు శ్రీమాన్ మాట్లాడుతూ మైథాలజీ నుంచి ఇన్స్ పైర్ రాసుకున్న కథతో “రాక్షస కావ్యం” సినిమాను తెరకెక్కించానని, ఈ కథను 30, 40 మంది ప్రొడ్యూసర్స్ కు చెప్పా కానీ వాళ్లు డేర్ చేయలేకపోయారని అన్నారు. కానీ దాము గారు కథ విని సినిమా చేద్దామని ముందుకొచ్చారని పేర్కొన్న ఆయన పురాణాల్లోని జయ విజయులు ఒక్కో యుగంలో ఒక్కో రాక్షసుల్లా పుట్టారు, వాళ్లు ఇప్పుడు కలియుగంలో వస్తే ఎలాంటి పనులు చేస్తారనే ఫిక్షనల్ పాయింట్ తో ఈ సినిమా ఉంటుందని అన్నారు. టీజర్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం, సినిమాను కూడా ఇష్టపడతారు అని ఆయన అన్నారు.