Rakhi Sawant: నా మాజీ భర్త నిలువునా దోచేసుకున్నాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎప్పుడూ ఏదో ఒక వివాదం లేదా విచిత్రమైన పనితో వార్తల్లోకెక్కే బాలీవుడ్ భామ రాఖీ సావంత్.. ఇప్పుడు మరోసారి టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారింది. తన బాయ్‌ఫ్రెండ్ ఆదిల్ ఖాన్‌తో కలిసి.. శుక్రవారం సాయంత్రం ఒషివర పోలీస్ స్టేషన్లో మాజీ భర్తపై ఫిర్యాదు చేసింది. తన షోషల్ మీడియా ఖాతాలు, ఆన్లైన్ చెల్లింపుల విధానాల్ని మాజీ భర్త రితేష్ హ్యాక్ చేశాడని.. తన జీవితాన్ని నాశనం చేస్తానని అతడు బెదిరించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. తన కొత్త బాయ్‌ఫ్రెండ్ ఆదిల్‌ను చూసి రితేష్ అసూయ చెందుతున్నాడని, అందుకు ప్రతీకారం తీర్చుకునేందుకే ఇలా చేస్తున్నాడంటూ రాఖీ సావంత్ ఆరోపణలు చేసింది.
‘‘నా మాజీ భర్త రితేష్ నన్ను ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. నా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, జీ-మెయిల్ ఖాతాల్ని హ్యాక్ చేశాడు. నా ఖాతాలన్నింటిలోనూ అతని పేరు, నంబర్ ఉన్నాయి. మేమిద్దరం కలిసున్నప్పుడు నా ఖాతాల వివరాల్ని అతడికిచ్చాను. అప్పట్నుంచి పాస్వర్డ్లు మార్చలేదు. మేమిద్దరం స్నేహపూర్వకంగా విడిపోయినప్పటికీ.. అతడు ప్రతీకార ధోరణితోనే వ్యవహరిస్తున్నాడు. నన్ను నాశనం చేస్తానని బెదిరించాడు కూడా! ఈమధ్య మనం ఇన్‌స్టాగ్రామ్‌ల నుంచి డబ్బులు ఆర్జిస్తున్నామన్న విషయం అందరికీ తెలుసు. అతడు దాన్ని కూడా హ్యాక్ చేశాడు. అందుకనే అతనిపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కి వచ్చాను’’ అని రాఖీ సావంత్ మీడియాతో చెప్పుకొచ్చింది.
Also Read
అంతేకాదు.. తన సోషల్ మీడియా ఖాతాల్లో కలర్స్ టీవీకి వ్యతిరేకంగా రితేష్ విషయాలు పోస్ట్ చేస్తున్నాడని రాఖీ తెలిపింది. వాటిని చూసి, తానే రాస్తున్నానేమోనని టెలివిజన్ వాళ్ళు భావిస్తున్నారని.. తనని వాళ్లు బ్యాన్ చేయాలని రితేష్ గట్టిగా కోరుకుంటున్నాడని రాఖీ సావంత్ పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు వ్యవహారం బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.
తాజావార్తలు
-
iPhone 16: ఫ్లిప్‌కార్ట్ GOAT Sale కంటే ముందే iPhone 16పై భారీ తగ్గింపు..!
-
NBK 112 : బాలయ్య -కొరటాల మాస్ సినిమా కాదు.. అంతకుమించి
-
Hyderabad: షా గౌస్, మెహ్‌ఫిల్‌లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
-
Lenin movie trailer : లెనిన్ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్.. అయ్యగారు ఆన్ ట్రాక్
-
Stokes-Archer: వికెట్ పడినా సెలబ్రేషన్స్ చేసుకొని ఆర్చర్.. స్టోక్స్ అసహనం.. అసలు కారణం ఇదే!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!