Raj Tarun : తిరగబడరసామీ థియేట్రికల్ రిలీజ్ డేట్ వచ్చేసింది..
- ఆగస్టు 2న వస్తోన్న తిరగబడరసామీ విడుదల
- మరోవైపు లావణ్య కేసుల వ్యవహారంతో రాజ్ తరుణ్ ఉక్కిరిబిక్కిరి
- లావణ్య కేసులో A -1గా చేర్చిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజ్ తరుణ్ గత వారం రోజుల నుండి తెలుగు చిత్ర సీమలో ఈ హీరో పేరు వినిపించినంతగా మరేహీరో పేరు వినిపించలేదు. ఇతగాడి మాజీ ప్రియురాలు లావణ్య అతడిపై కేసు పెట్టడం, మాన్వి మల్హోత్రా అనే హీరోయిన్ తో రాజ్ తరుణ్ రిలేషన్ లో ఉన్నాడని అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు, కాల్ రికార్డింగ్స్ బయటకు రావడంతో రాజ్ తరుణ్ వ్యవహారం రచ్చకెక్కింది. ఇరువురు వాదనలు, పరస్పర ఆరోపణలతో రోజుకో మలుపు తిరుగుతోంది వీరిద్దరి వ్యవహారం.
కాగా రాజ్ తరుణ్ హీరోగా మాన్వి మల్హోత్రా హీరోయిన్ గా తిరగబడరసామీ అనే చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం షూటింగ్ సమయంలోనే మాన్వి మల్హోత్రాతో ప్రేమాయణం సాగించి తనను దూరం పెట్టాడని లావణ్య ఆరోపించింది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు రెడీగా ఉన్న సినిమాను తొలుత ఫిబ్రవరి 23న విడుదల చేయాలని భావించారు నిర్మాతలు. కానీ అనికొని కారణాల వలన ఆగిపోయింది. మరోసారి జులై 19న విడుదల ప్లాన్ చేయగా కేసుల్లో భాగంగా రాజ్ తరుణ్ ప్రచార కార్యక్రమాలాకు హాజరు కావడం కుదరదు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో విడుదల చేయడం కరెక్ట్ కాదని భావించిన నిర్మాతలు ఆగస్టు -2న విడుదల చేయబోయితున్నట్టు అధికారకంగా ప్రకటించారు. ఈలోగా ఈ కేసుల వ్యవహారం ఓ కొలిక్కి వస్తే రాజ్ తరుణ్ తిరగబడరసామీ ప్రమోషన్స్ లో పాల్గొంటాడని నిర్మాతలు భావిస్తోన్నారు. అసలే హిట్లు లేక సతమవుతున్న ఈ యంగ్ హీరోకు ఈ కేసుల వ్యవహారం తలనొప్పిగా మారింది. తిరగబడరసామీ టైటిల్ తగ్గట్టుగానే రాజ తరుణ్ వ్యవహారం నడుస్తోంది. ఆగస్టులో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రాన్ని సురక్ష్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ నిర్మిస్తోండగా ఎ.ఎస్. రవికుమార్ చౌదరి దర్శకత్వం వహిస్తునాడు.
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
Also Read : Sudheer babu: హరోం హర ఓటీటీ విడుదల వాయిదా..?
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..