Rajinikanth: జైలర్ కాదు… ఇప్పుడు గవర్నర్ రజనీకాంత్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajinikanth To Be Appointed As Governor Soon: ఒకసారి పొలిటికల్ ఎంట్రీకి సిద్దమై చివరి నిముషంలో వెనక్కి తగ్గారు తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, అయితే రజనీకాంత్ గవర్నర్ కాబోతున్నారని ప్రచారం మాత్రం అడపాదడపా తెర మీదకు వస్తూనే ఉంది. ఇక జైలర్ సక్సెస్ తో ఉన్న ఆయన బీజేపీకి మద్దతుగా గతంలో కొన్ని కామెంట్లు చేయడం ఇటీవల బీజేపీ సీఎం యోగి కాళ్ళపై పడి ఆశీస్సులు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇక రజనీకాంత్ గవర్నర్ కాబోతున్నారని జరుగుతున్న ప్రచారంపై ఆయన సోదరుడు సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రజనీకి గవర్నర్ పదవి దేవుడి చేతుల్లో ఉందని చెబుతూ ఊహాగానాలకు మరింత ఆజ్యం పొసేశారని చెప్పాలి. అయితే ఆయన మాట్లాడుతూ ఆయన రాజకీయాల్లోకి మాత్రం రాబోరని కుండబద్దలు కొట్టేశారు.
బిగ్ బాస్ 7 కంటెస్టెంట్లకి దిమ్మతిరిగే రెమ్యునరేషన్లు.. ఒక్కొక్కరికి ఎన్ని లక్షలో తెలుసా?
Also Read
- Aadarsha Kutumbam Postponed: వెంకీ మామా ‘ఆదర్శ కుటుంబం’ పోస్ట్‌పోన్.. కొత్త డేట్ ఇదేనా?
- Z5: బాలయ్య, వెంకీ, అఖిల్, చైతూలతో 'జీ5' సంచలనం..కళ్లు చెదిరే బ్లాక్ బస్టర్ లైనప్ ఇదే!
- Trivikram Srinivas: అప్పట్లో ‘అజ్ఞాతవాసి’ దెబ్బకు ఇల్లు అమ్మేయాలనుకున్న త్రివిక్రమ్.. అసలేం జరిగిందంటే?
- Irumudi Remuneration: రెమ్యునరేషన్ జీరో.. లాభాల్లో హీరో! ‘ఇరుముడి’తో రవితేజకు భారీగా కలిసి వచ్చిందంట..
తాజాగా మధుర మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్న సత్యనారాయణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంతో రజనీకాంత్ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని పేర్కొన్న సత్యనారాయణ రజనీకి గవర్నర్ పదవి మాత్రం దేవుడి చేతుల్లోనే ఉందన్నారు. ఇటీవల ఉత్తర భారతదేశంలో పర్యటించిన రజనీకాంత్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్, ఝార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌తో భేటీ కావడంతో ఈ గవర్నర్ అంశం మళ్లీ తెరపైకి వచ్చినట్లు అయింది. ఈ క్రమంలో మీడియా ప్రశ్నలకు స్పందించిన ఆయన రజినీకి గవర్నర్ పదవి రావాలని ఎలాంటి ఆశలు పెట్టుకోలేదనీ, ఒకవేళ వస్తే మాత్రం సంతోషిస్తామని అన్నారు. అయితే రజినీ సైతం గవర్నర్ పదవి ఆఫర్ ను తిరస్కరించరని ఆయన చెప్పడం, ఇటీవల పలువురు రాజకీయ నేతలను కలవడం, సత్యనారాయణ రావు వ్యాఖ్యలు అన్నీ చూస్తుంటే రజినీకి గవర్నర్ పదవి దక్కనుందనే ప్రచారానికి బలం చేకూరుతుందని అంటున్నారు.
తాజావార్తలు
-
Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
-
Weight Loss Snack: బరువు తగ్గాలనుకుంటున్నారా? పొట్ట చుట్టూ కొవ్వు కరగాలా? మీ డైట్లో దీనిని చేర్చుకోండి!
-
PM Modi: ఉజ్బెకిస్థాన్‌కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
-
Geoffrey Boycott: సచిన్, లారాలను మించిపోయే సత్తా అతడికి ఉంది.. సంచలన వ్యాఖ్యలు..
-
Sanju Samson: ప్రపంచకప్ గెలవాలనే ఆ ఒక్క నిర్ణయం శామ్సన్ కెరీర్‌ను మార్చేసిందా..? అసలు ఏం జరిగిందంటే..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!