నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా దసరా సీజన్ లో రిలీజై థియేటర్స్ లో మంచి రిజల్ట్ ని సొంతం చేసుకుంది. అక్టోబర్ 19న ఆడియన్స్ ముందుకి వచ్చిన భగవంత్ కేసరి సినిమాలో తన ట్రేడ్ మార్క్ కామెడీని దాటి అనీల్ రావిపూడి, తన మాస్ ని పక్కన పెట్టి బాలయ్య కొత్తగా వర్క్ చేసారు. ఈ ఇద్దరు కలిసి ఒక సోషల్ కాజ్ ఉన్న సినిమాని చేస్తారని ఎవరు అనుకోని ఉండరు. గర్ల్ ఎమ్పవర్మెంట్ చుట్టూ అల్లిన కథతో భగవంత్ కేసరి ఫ్యామిలీ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసింది. లియో సినిమాతో క్లాష్ లో కూడా భగవంత్ కేసరి స్లో అవ్వలేదు. బాలయ్య కెరీర్ లో హ్యాట్రిక్ వంద కోట్ల సినిమాగా భగవంత్ కేసరి నిలిచింది. ఒక అమ్మాయికి ముఖ్యపాత్ర ఇచ్చి మాస్ హీరో ఇమేజ్ ఉన్న తను సినిమాలో నటించడం బాలయ్య గొప్పదనం అనే చెప్పాలి.
అనిల్ రావిపూడిపై రెస్పెక్ట్ పెంచిన భగవంత్ కేసరి సినిమా రైట్స్ కోసం రజినీకాంత్-విజయ్ లు పోటీ పడుతున్నారని సమాచారం. రజినీకాంత్ కైతే భగవంత్ కేసరి కథలో ఎలాంటి మార్పులు చేయకుండా ఉన్నది ఉన్నట్లు తీసేయొచ్చు. కాకపోతే జైలర్ సినిమాలో పోలీస్ గెటప్ ఉంది, భగవంత్ కేసరిలో పోలీస్ గెటప్ ఉంది… ఈ ఒక్క విషయంలో సిమిలర్ గా కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటే చాలు రజినీకాంత్ కి భగవంత్ కేసరి సినిమా పర్ఫెక్ట్ గా సరిపోతుంది. విజయ్ విషయంలో ఇలా కాదు… విజయ్ కాస్త యంగ్ అండ్ పొలిటికల్ ఎంట్రీ కూడా ఇస్తున్నాడు కాబట్టి ఇందుకు తగ్గట్లు భగవంత్ కేసరి సినిమాలో మార్పులు చేర్పులు జరగాల్సి ఉంటుంది. కథలో మంచి నోవెల్ పాయింట్ ఉంది కాబట్టి రజినీ చేసినా విజయ్ చేసినా హిట్ అవ్వడం మాత్రం గ్యారెంటీ. మరి ఈ రీమేక్ ఎవరి చేతికి వెళ్తుంది అనేది చూడాలి.