Rajendra Prasad : వయసు పెరిగే కొద్దీ నటుడికి విలువ పెరగాలి. హుందాతనం అనువనువునా కనపడాలి. అదే ఆయన్ను మరో స్థాయిలో నిలబెడుతుంది. కానీ నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మాత్రం ఇన్నేళ్లు కష్టపడి సంపాదించిన పేరు, ప్రతిష్టలు నోటి మాటతో పోగొట్టుకుంటున్నాడు. విజ్ఞానం మరీ ఎక్కువైన వ్యక్తి కాకరకాయను పట్టుకుని గీకరకాయ అన్నాడంట. రాజేంద్ర ప్రసాద్ కూడా ఇలాగే తయారయ్యాడు. ఈ నడుమ స్టేజి ఎక్కితే ఏం మాట్లాడుతున్నాడో అతనికి కూడా అర్థం కావట్లేదేమో అనిపిస్తుంది. మైక్ పడితే కంట్రోల్ తప్పుతున్నాడు. సభా మర్యాదలు కూడా మర్చిపోతున్నాడు. ఎవరిని పడితే వారిని బూతులు అనేస్తున్నాడు. తన స్థాయి మర్చిపోయి తన విలువ తానే తగ్గించుకుంటున్నాడు.
Read Also : Aditi Shankar : మెహర్ రమేశ్ ను అంత మాట అనేసిన అదితి శంకర్..
ఆ నడుమ రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ను పట్టుకుని దొంగ ముం* కొడుకు అనేశాడు. తెలుగు యువత చీవాట్లు పెట్టడంతో క్షమాపణ చెబుతూ వీడియో రిలీజ్ చేశాడు. దానికంటే ముందు ఓ ఈవెంట్ లో మాట్లాడుతూ అల్లు అర్జున్ పై ఇన్ డైరెక్ట్ గానే నోరు పారేసుకున్నాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసేవాడు హీరో ఏంటి అని దురుసుగా మాట్లాడాడు. దానిపై పెద్ద రచ్చనే జరిగింది. బన్నీ ఫ్యాన్స్ ఏకిపారేశారు. మరి అంత జరిగినా నోరు అదుపులో పెట్టుకుంటున్నాడా అంటే మళ్లీ అదే బాట పట్టాడు.
తాజాగా ఎస్వీ కృష్ణారెడ్డి బర్త్ డే ఈవెంట్ లో కమెడియన్ అలీని పట్టుకుని లం* కొడుకు అనేశాడు. ఇంత ఘోరమైన మాట అనడం అంటే మామూలు విషయం కాదు. అంత మంది ముందు ఆ మాట అనేసినా సరే అలీ మాత్రం మౌనంగా ఉండిపోయాడు. ఒక నటుడిగా రాజేంద్ర ప్రసాద్ కు ఎనలేని అనుభవం ఉంది. మరి ఆ అనుభవం అంతా ఎటు పోయింది. ఇన్నేళ్లలో ఎలాంటి మచ్చలేకుండా ఈ స్థాయి దాకా వచ్చిన రాజేంద్ర ప్రసాద్ కు ఇప్పుడు ఏమైంది. నటనలో శిఖరాలు ఎక్కిన ఘనుడు.. మాటలో ఎందుకు తడబడుతున్నాడు.
ముప్పై ఏళ్లకు పైగా నట ప్రస్థానంలో సంపాదించిన గౌరవం.. మూడు ఈవెంట్లతో పోగొట్టుకుంటే ఎలా.. ఒకసారి అంటే పొరపాటు అనుకోవచ్చు. ప్రతిసారి అంటే అలవాటైపోయిందనే కదా అర్థం. రాజేంద్ర ప్రసాద్ స్థాయి నటుడి నుంచి ఈ మాటలు ఎవరూ ఊహించరు. ఆయన అదేదో కామెడీ కోసం అంటున్నానని ఈ నడుమ కవర్ చేస్తున్నా.. అది మాత్రం కాంట్రవర్సీనే అవుతోంది. వినేవారికే ఇబ్బందిగా ఉంటే.. భరించే వారికి ఇంకెంత బాధగా ఉంటుంది.
ఇప్పటి వరకు రాజేంద్ర ప్రసాద్ నోరు జారినా.. వారెవరూ బయటకొచ్చి మాట్లాడలేదు. అది రాజేంద్ర ప్రసాద్ స్థాయికి, వయసుకు ఇచ్చే గౌరవం అనుకోవాలేమో. నటుడిగా లక్షల నోర్లు ప్రశంసించే నటకిరీటి.. నోరు జారితే అదే స్థాయిలో విమర్శలు ఉంటాయనేది గుర్తు పెట్టుకోవాలి. ఇన్నేళ్ల ప్రస్థానాన్ని చేతులారా దిగజార్చుకోకుండా కాపాడుకుంటే మంచిదని అంటున్నారు ఆయన్ను అభిమానించే వారు.
Read Also : Rajendra Prasad : మళ్లీ నోరు జారిన నటుడు రాజేంద్ర ప్రసాద్.. అలీని తిట్టేశాడు..