Rajamouli: సబ్స్క్రిప్షన్ ట్రెండ్ నూ వదలని జక్కన్న.. ఇదెక్కడి మాస్ ప్లాన్ అయ్యా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాహుబలి, RRR సినిమాలతో ఇండియన్ సినిమా స్థాయిని ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన ఈ జక్కన్న, ఇప్పుడు సూపర్‌స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ కోసం అంతకు మించిన ప్లాన్‌తో రంగంలోకి దిగుతున్నారు.ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో తాజాగా ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది అదేమంటే ఈ మెగా ప్రాజెక్ట్ కోసం రాజమౌళి ఒక వినూత్నమైన మార్కెటింగ్ స్ట్రాటజీని అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అయిన సబ్ స్క్రిప్షన్ ట్రెండును రాజమౌళి ఇప్పుడు తనకు అనుకూలంగా వాడుకున్నట్టున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఏదైనా సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోలు, షూటింగ్ విశేషాలు లేదా నటీనటుల ఇంటర్వ్యూలు సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి వాడుకుంటారు కాబట్టి దాదాపుగా అవన్నీ ఉచితంగానే దొరుకుతాయి.
కానీ, ‘వారణాసి’ విషయంలో రాజమౌళి రూటు మార్చారు. ఈ సినిమా వెనుక ఉన్న కష్టాన్ని, తెర వెనుక జరిగే ఆసక్తికరమైన BTS Videos వీక్షించాలనుకునే అభిమానుల కోసం రూ. 199 ధరతో ఒక ప్రత్యేక ప్యాకేజీని తీసుకురానున్నట్లు సమాచారం. ఈ ప్యాకేజీలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రాలకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ ఫోటోలు., సినిమా కోసం వారు పడుతున్న శ్రమను వివరించే బిహైండ్ ది సీన్స్ వీడియోలు, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి స్టార్ కాస్ట్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూలు, ప్రేక్షకులకు ఎక్కడా దొరకని కొన్ని ఆసక్తికరమైన ‘టెడ్ బిట్స్’ వంటి వాటిని ఉంచబోతున్నారు. సినిమా టికెట్ ధరలకే జనం బెంబేలెత్తిపోతున్న ఈ రోజుల్లో, కేవలం ప్రమోషనల్ కంటెంట్ కోసం డబ్బులు అడగడం అనేది సాహసోపేతమైన నిర్ణయమే. అయితే, రాజమౌళి సినిమాలపై ఉండే క్రేజ్ సామాన్యమైనది కాదు. ఆ ప్రాజెక్ట్ మేకింగ్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే కుతూహలం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకుల్లో ఉంది. ఒకవేళ ఈ స్ట్రాటజీ గనుక క్లిక్ అయితే, భవిష్యత్తులో ఇతర పెద్ద దర్శకులు, స్టార్ హీరోలు కూడా తమ సినిమాల ప్రమోషన్ల కోసం ఇదే బాట పట్టే అవకాశం ఉంది. ఇప్పటికే భారీ బడ్జెట్‌తో, గ్లోబల్ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 7, 2027న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
తాజావార్తలు
-
Oneplus 16 Launched: 9000mAh బ్యాటరీ, 200MP కెమెరా, 120X జూమ్.. వన్ ప్లస్ నుంచి మొబైల్ లాంచ్..
-
Kitchen Cleaning Tips: కిచెన్ సింక్‌లో నీళ్లు నిలిచిపోతున్నాయా? ఈ చిట్కాలతో సులభంగా క్లియర్ చేయండి!
-
New Car Launched: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 828 కిలోమీటర్లు వెళ్లొచ్చు.. మైండ్ బ్లోయింగ్ కారు ఫీచర్స్ ఇవే..
-
Sergio Gor: గత వారం మోడీ-ట్రంప్ మాట్లాడుకున్నారు.. ఏం జరుగుతుందో చూద్దామన్న సెర్గియా గోర్
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే!
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!