ఇండియన్ సినిమా రేంజ్ పెంచిన వాడు, ఆస్కార్ కి ఇండియాకి తెచ్చిన వాడు మన దర్శక ధీరుడు రాజమౌళి. ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ కి ముందు ఇండియన్ సినిమా గ్లోరీని ప్రపంచానికి పరిచయం చేస్తాను అని మాటిచ్చిన జక్కన్న, దాన్ని నిలబెట్టుకుంటూ మన సినిమా ఇప్పటివరకూ చేరుకోని ప్రతి చోటుకి ఆర్ ఆర్ ఆర్ సినిమాని తీసుకోని వెళ్లాడు. టాలీవుడ్, సౌత్ ఫిలిం ఇండస్ట్రీలకి మాత్రమే కాదు యావత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పేరు తెచ్చిన రాజమౌళి నెక్స్ట్ సినిమా కోసం పాన్ వరల్డ్ ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. వారిని ఎక్కువ రోజులు వెయిట్ చేయించడం ఇష్టం లేని రాజమౌళి, ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్ లోనే తన నెక్స్ట్ సినిమా మహేష్ బాబుతో అని చెప్పేసాడు. ‘ఇండియానా జోన్స్ తరహాలో గ్లోబ్ ట్రాట్టింగ్ కథని మహేశ్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేస్తాన”ని చెప్పిన రాజమౌళి SSMB 29 ప్రాజెక్ట్ పై ప్రపంచ సినీ అభిమానుల్లో అంచనాలు పెంచాడు. సీక్వెల్, ప్రీక్వెల్ అనేలా కాకుండా ఒక అడ్వెంచర్ వరల్డ్ ని క్రియేట్ చేసి అందులో నుంచి సినిమా చెయ్యాలని రాజమౌళి ఆలోచిస్తున్నాడట.
రైటర్ విజయేంద్ర ప్రసాద్ కూడా ఈ విషయాన్ని ఇప్పటికే పలు ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పాడు. #SSMB29 అడ్వెంచర్ వరల్డ్ నుంచి వచ్చే సినిమాల్లో కథలు వేరుగా ఉంటాయి కానీ క్యారెక్టర్స్ మాత్రం రిపీట్ అవుతూ ఉంటాయట. ఇండియాలో ఇలాంటిది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. మన దగ్గర ఫ్రాంచైజ్ లు ఉన్నాయి కానీ లార్జ్ స్కేల్ లో రూపొందిన ఫ్రాంచైజ్ లు అయితే లేవు. అడ్వెంచర్ సినిమా చేసే సమయంలో, ఎన్నో ఇంటరెస్టింగ్ పాయింట్స్ పుడుతూ ఉంటాయి, కొత్త కాన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉంటాయి, సినిమా సినిమాకి ఛాలెంజులు పెరుగుతూ ఉంటాయి, స్పాన్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇలాంటి ఒక యూనివర్స్ లోకి ఏ క్యారెక్టర్ ఎక్కడి నుంచైనా రావొచ్చు, దాని లీడ్ సినిమాని ఎటైనా టర్న్ చెయ్యొచ్చు. సో రాజమౌళి, మహేశ్ లు ఫ్రాంచైజ్ ని చేస్తున్నారు అనేది నిజమైతే… ఈ వరల్డ్ లో చాలా మంది హీరోలని, హీరోయిన్ లని, ఇంటరెస్టింగ్ సెటప్ లో రూపొందించిన సీన్స్ ని చూసే ఛాన్స్ ఉంది. అయినా రాజమౌళి ఒక్క పార్ట్ గా ఆర్ ఆర్ ఆర్ సినిమాని చేస్తేనే పాన్ వరల్డ్ షేక్ అయ్యింది, ఆస్కార్ ఇండియాకి వచ్చింది. మరి ఫ్రాంచైజ్ అంటే అది కూడా ఇండియానా జోన్స్ రేంజులో అంటే వరల్డ్ సినిమాపై ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుందో అర్ధం చేసుకోవచ్చు.