Rajamouli: వందలో ‘ఒకే ఒక్కడు’ ఈ దర్శక ధీరుడు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజు యావత్ ప్రపంచం తెలుగు ఇండస్ట్రీ వైపు చూస్తోంది అంటే అది కేవలం దర్శక ధీరుడు రాజమౌళి వల్లే. బాహుబలి అనే ప్రాజెక్ట్ రాజమౌళి చేయకపోయి ఉంటే టాలీవుడ్, హాలీవుడ్ లెవల్‌కి వెళ్లకపోయేది. ట్రిపుల్ ఆర్ సినిమాతో ఏకంగా ఆస్కార్ కొట్టేసి.. హిస్టరీ క్రియేట్ చేశాడు జక్కన్న. జేమ్స్ కామెరాన్, స్పీల్ బర్గ్ లాంటి హాలీవుడ్ దర్శక దిగ్గజాలు కూడా జక్కన్న మేకింగ్‌కు ఫిదా అయిపోయారు. అందుకే రాజమౌళి ఇప్పుడో ఇంటర్నేషనల్ బ్రాండ్ అయిపోయాడు. ఆయన నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా, న్యూస్ వచ్చినా సోషల్ మీడియా షేక్ అయిపోతోంది. ఇప్పటికే ఎన్నో అరుదైన రికార్డ్స్ క్రియేట్ చేసిన జక్కన్న… తాజాగా వంద మందిలో ఒకే ఒక్కడుగా నిలిచాడు. తాజాగా టైమ్స్ మ్యాగిజైన్ ప్రకటించిన ‘టాప్ 100 వరల్డ్ ఇన్ల్ఫూయెన్షిల్ పీపుల్’ జాబితాలో రాజమౌళి చోటు దక్కించుకున్నారు.
రాజమౌళితో పాటు ఇండియాకు సంబంధించిన పలువురు సెలబ్రెటీలు కూడా ఈ లిస్ట్‌లో ఉన్నారు. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కూడా ఉన్నాడు. అలాగే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఎలాన్ మస్క్, సాకర్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కూడా ఈ వంద మందిలో ఉన్నారు. ఇలాంటి జాబితాలో రాజమౌళి చోటు దక్కించుకోవడం విశేషం. రాజమౌళికి ఐకానిక్ క్యాటగిరిలో.. షారుఖ్‌కి పయోనీర్స్ క్యాటగిరిలో చోటు దక్కించుకున్నారు. అయితే ఈ జాబితాలో ఓ తెలుగు దర్శకుడు చోటు దక్కించకోవడం ఇదే మొదటిసారి. ఇది తెలుగోడిగా ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ విషయం. ప్రస్తుతం రాజమౌళి పేరు మరోసారి ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆర్‌ఆర్ఆర్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా చేయబోతున్నారు రాజమౌళి. ఈ సినిమాతో జక్కన్న హాలీవుడ్‌లో జెండా పాతేయడం ఖాయం. మరి రాజమౌళి ఫ్యూచర్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.
Also Read
- Hanuman Ansh : రూ. 400 కోట్ల దిశగా హనుమాన్ అంశ్ 47వ రోజు దాదాపు రూ. 5 కోట్లు వసూళ్లు
- Sanjay Leela Bhansali : రణబీర్ కపూర్ 'లవ్ అండ్ వార్' ఫస్ట్ లుక్ రిలీజ్
- Hashmi - Himesh : 20 ఏళ్ల తర్వాత ఇమ్రాన్ హష్మీ, హిమేష్ రేష్మియా రీ యూనియన్
- Karthik Subbaraj : స్టార్స్‌ని పక్కన పెట్టి రైజింగ్ హీరోలతో ఆడియన్స్ టెస్ట్‌కు రెడీ అయిన కార్తీక్ సుబ్బరాజ్
తాజావార్తలు
-
Danam Nagender: సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నా.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ..!
-
Xiaomi TV: Xiaomi TV S Pro RGB-Mini LED 2027 సిరీస్ లాంచ్.. 98 ఇంచెస్ స్క్రీన్, Dolby Atmos, HyperOS 4
-
Hanuman Ansh : రూ. 400 కోట్ల దిశగా హనుమాన్ అంశ్ 47వ రోజు దాదాపు రూ. 5 కోట్లు వసూళ్లు
-
Hyderabad Metro: వినాయక భక్తులకు గుడ్ న్యూస్.. నిమజ్జనం వేళ హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ మార్పు.! లాస్ట్ రైలు ఎప్పుడంటే?
-
Kakumanu Rajasekhar Death: వైసీపీలో విషాదం.. కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!