Site icon NTV Telugu

TheRajaSaab Premieres: రాజాసాబ్ గందరగోళం బయటపెట్టిన మైత్రీ శశి

The Rajasaab

The Rajasaab

‘రాజా సాబ్’ ప్రీమియర్స్ విషయంలో పెద్ద గందరగోళం జరిగిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం నుంచి రేట్ల పెంపు జీవో మీద క్లారిటీ రాకపోవడంతో.. టికెట్ల అమ్మకాలు జరిగిన షోస్ పడకుండా పెద్ద గందరగోళమే జరిగింది. తాజాగా ఇదే విషయాన్ని ఒక సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి హాజరైన మైత్రీ శశిని ప్రశ్నిస్తే, అసలు ఆ రోజు ఏం జరిగింది అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. “అప్పుడు ఇదే అంశం మీద కోర్టులో ఐదు కేసులు పెండింగ్ ఉన్నాయి, ఆ విషయం మాకు తెలియదు. ఆ 5 కేసులు మేమే పుటప్ చేయాల్సి వచ్చింది. వాటిని మేము పుటప్ చేసి అప్లై చేస్తే.. సినిమా ఫ్రైడే రిలీజ్ అంటే కోర్టు బుధవారం సాయంత్రం జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ ఐదు కేసులు కొట్టివేసి దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అంతా ఆ రోజు రాత్రి మా చేతికి వచ్చింది. అది వచ్చేదాకా మనం తెలంగాణ ప్రభుత్వానికి అనుమతి కోరలేకపోయాం.”

Also Read:Aditya Dhar: ధురంధర్ 3 కాదు.. డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఇదే!

“బుధవారం రాత్రి ఆర్డర్స్ మా చేతికి వచ్చాక, గురువారం ఉదయం మేము అప్లై చేశాం. ఈ క్రమంలోనే అది చాలా షార్ట్ నోటీస్ అవ్వడంతో ఆరోజు మాకు టికెట్ రేట్ల పెంపు జీవో రాలేదు, ఎప్పుడో లేట్ నైట్ వచ్చింది. పెద్ద పెద్ద సినిమాలు చేసినప్పుడు ఆ నిర్మాతలు కానీ, ఆయా హీరోల ఫ్యాన్స్ కానీ పెద్ద రెవెన్యూ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇదే విషయంలో మేము అడుగుతూనే ఉన్నాం, వాళ్ళు చెబుతూనే ఉన్నారు. ‘ఐదు నిమిషాల్లో వస్తుంది’ అని సాయంత్రం ఏడు గంటల నుంచి చెబుతూనే వచ్చారు. అయితే ఆ జీవో రావడం లేదని మేము టక్కుమని డెసిషన్ తీసుకోవడానికి లేదు. ఎందుకంటే పెద్ద హీరో సినిమా, ఆ రిస్క్ తీసుకోలేకపోయాం” అని అన్నారు.

Exit mobile version