హైదరాబాద్ గల్లీ నుంచి ఆస్కార్ స్టేజ్ పై లైవ్ పెర్ఫార్మెన్స్ వరకూ వెళ్లాడు రాహుల్ సిప్లిగంజ్. ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ ని అన్ని బాషల్లో కాలభైరవతో కలిసి పాడిన రాహుల్ సిప్లిగంజ్ ఎన్టీవీకి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో రాహుల్ సిప్లిగంజ్ తన ఆస్కార్ జర్నీ విశేషాలని షేర్ చేసుకున్నాడు. తనకి అంత పెద్ద అవకాశం ఇచ్చిన కీరవాణికి రుణపడి ఉంటాను అని చెప్పిన రాహుల్, నాటు నాటు సాంగ్ ని లైవ్ గా పెర్ఫార్మెన్స్ చేస్తున్నపుడు స్టాండింగ్ ఒవిఎషణ్ వచ్చింది అంతకన్నా ఏం కావాలి అని చెప్పాడు. లైవ్ పెర్ఫార్మెన్స్ లో చరణ్-ఎన్టీఆర్ లు లేకపోవడమే తక్కువ అయ్యింది కానీ వేరే ఇద్దరినీ పెట్టి నాటు నాటు సాంగ్ ని రీక్రియేట్ చేశాము. వాళ్లు కూడా డాన్స్ బాగా చేశారు అని చెప్పిన రాహుల్ సిప్లిగంజ్, కార్ డ్రైవ్ చేస్తూనే నాటు నాటు పాటని అందుకున్నాడు. మంచి జోష్ లో నాటు నాటు సాంగ్ ని కంప్లీట్ చేసిన రాహుల్ సిప్లిగంజ్, తను నెక్స్ట్ చెయ్యబోయే సాంగ్ గురించి స్పెషల్ అప్డేట్ ఇచ్చాడు. సినిమాల్లో పాటలతో పాటు రాహుల్ పాడే ప్రైవేట్ సాంగ్స్ కి కూడా స్పెషల్ క్రేజ్ ఉంటుంది.
తెలుగు నుంచి ఆల్బమ్ సాంగ్స్ చెయ్యడంలో రాహుల్ తర్వాతే ఎవరైనా అనే కాంప్లిమెంట్స్ అందుకుంటున్న రాహుల్ సిప్లిగంజ్… దుబాయ్ లో ఒక ప్రైవేట్ సాంగ్ చేసానని చెప్పాడు. అయితే ఎప్పటిలా తెలుగులో మాత్రమే కాకుండా ఈసారి హిందీ, తమిళ్, కన్నడలో కూడా ఈ ఆల్బమ్ సాంగ్ ని రాహుల్ సిప్లిగంజ్ పాడాడట. ఇతర భాషల్లోని టాప్ మోస్ట్ లిరిసిస్ట్ లు రాహుల్ సిప్లిగంజ్ కొత్త సాంగ్ ని లిరిక్స్ రాసారట. మరి పాన్ ఇండియా సినిమాతో ఆస్కార్ స్టేజ్ పై పెర్ఫార్మెన్స్ చేసే వరకూ వెళ్లిన రాహుల్ సిప్లిగంజ్, పాన్ ఇండియా సాంగ్ తో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడు? సాంగ్ ఎంత క్యాచీగా ఉండబోతుంది? డాన్స్ ఎవరు కంపోజ్ చేశారు? ఫిమేల్ లీడ్ ఎవరు? సినిమాటోగ్రఫి ఎవరు? అనేది విషయాలకి సమాధానం తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చెయ్యాల్సిందే.