Chandramukhi 2 Release date announced: స్టార్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్, యాక్టర్ రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తోన్న ‘చంద్రముఖి 2’ సినిమాలో బాాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమాలతో పాటు కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు అందిస్తూ తమదైన గుర్తింపు సంపాదించుకున్న అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభస్కరన్ ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. సీనియర్ డైరెక్టర్ పివాసు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా మీద భారీ అంచానాలు ఉన్నాయి. ఎందుకంటే 18 ఏళ్లకు ముందు పి.వాసు దర్శకత్వంలో వచ్చిన ‘చంద్రముఖి’ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. హారర్ జోనర్‌లో సరికొత్త సెన్సేషన్‌ను క్రియేట్ చేసిన చంద్రముఖి చిత్రానికి సీక్వెల్ గా ఇప్పుడు ‘చంద్రముఖి 2’ సినిమాను రూపొందిస్తున్నారు.
Lust Stories 2: ఓ సీతా, ఎందుకిలా చేశావ్? ‘ఆ సీన్’పై హర్టవుతున్న మృణాల్ ఫాన్స్
డైరెక్టర్ పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ 65వ సినిమాను వినాయక చవితి సందర్భంగా విడుదల చేస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి సంగీత సారథ్యం వహిస్తోన్న ఈ మూవీకి ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా జాతీయ అవార్డ్ గ్రహీత తోట తరణి ప్రొడక్షన్ డిజైనర్, ఆంథోని ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. ఇక ఈ సందర్భంగా లైకా ప్రొడక్షన్స్ సుభాస్కరన్ మాట్లాడుతూ ‘‘ఇండియన్ మూవీ హిస్టరీలో ‘చంద్రముఖి’కి ఓ ప్రత్యేకమైన స్థానం ఉందని, దానికి సీక్వెల్‌గా ‘చంద్రముఖి 2’ను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నామని అన్నారు. ఇక ప్రేక్షకుల అంచనాలను మించేలానే మూవీ ఉంటుందని ఆయన అన్నారు.