Site icon NTV Telugu

Raghava Lawrence : నిన్ను కొట్టను.. వచ్చి కలువు.. అతనికి రాఘవ లారెన్స్ ఆఫర్..

Raghava Lawrence

Raghava Lawrence

Raghava Lawrence : ఓ కుర్రాడికి రాఘవ లారెన్స్ మంచి ఆఫర్ ఇచ్చాడు. రవితేజ హీరోగా వచ్చిన విక్రమార్కుడు సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ మూవీలో చైల్డ్ ఆర్టిస్టుగా పనిచేశాడు రవి రాథోడ్. ‘రేయ్ సత్తి బాల్ లోపలికి వచ్చిందా’ అనే డైలాగ్ ఆ కుర్రాడికి ఉంటుంది. ఆ కుర్రాడు చైల్డ్ ఆర్టిస్టుగా దాదాపు 50 సినిమాలకు పైగా నటించాడు. ఆ తర్వాత అవకాశాలు దొరక్క సెట్ వర్క్స్ చేస్తూ గడుపుతున్నాడు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనను రాఘవ లారెన్స్ దత్తత తీసుకున్నాడని.. ఓ స్కూల్ లో చేర్పిస్తే మధ్యలోనే పారిపోయినట్టు తెలిపాడు.

Read Also : Sekhar Kammula : తమిళ్ లో కుబేర ఎందుకు ప్లాప్ అయిందో అర్ధం కాలేదు

ఇప్పుడు రాఘవ లారెన్స్ ను కలవాలంటే భయంగా ఉందని చెప్పాడు. ఆ ఇంటర్వ్యూ చూసిన రాఘవ.. తాజాగా స్పందించాడు. రవిని చూసి షాక్ అయ్యా. తను మంచి పొజీషన్ లో ఉన్నప్పుడు చూడాలనుకున్నా. మాస్ సినిమా సమయంలో కలిసి మంచి స్కూల్ లో జాయిన్ చేశా. కానీ మధ్యలోనే వెళ్లిపోయాడని తెలిసింది. ఆ తర్వాత ఏమైపోయాడు నాకు తెలియలేదు.

ఇప్పుడు సెట్ వర్క్స్ చేస్తున్నాడని తెలిసింది. నన్ను కలిస్తే తిడతానేమో అని భయపడుతున్నాడు. కానీ నేను తిట్టను, కొట్టను. నువ్వు ఒకసారి వచ్చి నన్ను కలువు. నిన్ను చూడాలని ఉంది’ అంటూ చెప్పాడు రాఘవ లారెన్స్. అతను చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Exit mobile version