సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్నకాంబోలో వచ్చిన సినిమా ‘కుబేర’. తొలి ఆటనుండి యునినామస్ బ్లాక్ బస్టర్ టాక్ అందుకున్న ‘కుబేర’ వరల్డ్ వైడ్ గా రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి దూసుకెళ్తోంది. నార్త్ అమెరికాలో ధనుష్ కెరీర్ బిగెస్ట్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా ధనుష్ నటన కు మంచి ప్రశంసలు దక్కాయి. ధనుష్ గత సినిమా రాయన్ ను కంటే స్పీడ్ గా కుబేర వంద కోట్ల మార్క్ ను అందుకుని మరొక హిట్ ను ధనుష్ ఖాతాలో వేసింది.
Also Read : Vijay Devarakonda : 6 నెలలు చాలా టెన్షన్ పడ్డాను.. కానీ అదో తృప్తి
కానీ ధనుష్ సొంత స్టేట్ లో కుబేర ప్లాప్ అయింది. తమిళనాడులో మొదట రోజు మంచి స్టార్ట్ అందుకున్న కుబేర అక్కడ మిక్డ్స్ రెస్పాన్స్ రాబట్టింది. ధనుష్ నటన వరకు బాగుంది కానీ సినిమాను మరి సాగతీసారు అనే కామెంట్స్ వినిపించాయి. అందుకు తగ్గట్టే రెండవ రోజు నుండే కలెక్షన్స్ లో డ్రాప్ కనిపించింది. మొదటి వారానికి గాను అటు ఇటుగా రూ. 20 కోట్ల పై చిలుకు గ్రాస్ మాత్రమే రాబట్టి ప్లాప్ అయింది. అయితే ఈ ప్లాప్ ను దర్శకుడు శేఖర్ కమ్ముల అంగీకరించారు. ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ అందరికి కనెక్ట్ అయ్యే కథ. అందులోనూ ధనుష్ లాంటి స్టార్ నటుడు ఉండడంతో తమిళ ఆడియెన్స్ కు కనెక్ట్ అవుతుందని భావించాం. కానీ రిజల్ట్ మేము ఊహించిన దానికి బిన్నంగా వచ్చింది. కుబేర తమిళ్ లో ఎందుకు ప్లాప్ అయిందో మేము ఒకసారి రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అన్నారు.