Rage of Bholaa Released by Ar Rehman: వాల్తేర్ వీరయ్య తో హిట్ కొట్టిన మెగాస్టార్ ఇఫ్పుడు భోళాశంకర్ మూవీ చేస్తున్నాడు. ఇందులో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా చిరు చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తుండగా అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమా వీళ్ల కెరీర్ కి కీలకంగా మారింది. దర్శకుడు మెహర్ రమేష్ షాడో లాంటి డిజాస్టర్ తర్వాత ఇండస్ట్రీలో కనిపించలేదు. చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ ఈ సినిమా చేస్తున్నాడు.ఈ ప్రాజెక్టు బ్లాక్ బస్టర్ కొడితేనే మెహర్ రమేష్ కి అవకాశాలు వస్తాయి. మరోపక్క భోళా శంకర్ ని నిర్మిస్తున్న అనిల్ సుంకర కి కూడా ఈ సినిమా రిజల్ట్ చాలా కీలకం. ఇప్పటికే అఖిల్ తో చేసిన ఏజెంట్ డిజాస్టర్ అయ్యింది.నిర్మాతగా కొంత నష్టపోవల్సి వచ్చింది. అందుకే భోళా శంకర్ కచ్చితంగా హిట్ కొట్టాలి. లేదంటే భారీ సినిమాలు నిర్మించి మార్కెట్ చేయడం అనిల్ సుంకర కి కష్టం అవుతుంది.
Rudrangi in OTT: 200 సినిమాల్లో రుద్రాంగి టాప్ 10.. ప్రైమ్ లో మిస్ అవ్వద్దంటున్న జగపతిబాబు
తమన్నా, అక్కినేని హీరో సుశాంత్, మెగాస్టార్ చిరంజీవికి కూడా భోళా శంకర్ రిజల్ట్ చాలా ముఖ్యం. ఇక ఈ సినిమా రిలీజ్ కి దగ్గరైన సందర్భంగా ఈ సినిమా నుండి మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ప్లే సాంగ్ ను మ్యూజిక్ సెన్సేషన్ ఎఆర్ రెహమాన్ చేతులు మీదుగా రిలీజ్ చేశారు. రేజ్ ఆఫ్ భోళా పేరుతో ఓ రాప్ ఆంథమ్ సాంగ్ ను రిలీజ్ చేయించింది భోళా మూవీ టీమ్. మహతి స్వర సాగర్ కంపోజ్ చేసిన ఈ ఆంథమ్ ను , డైరెక్టర్ మెహర్ రమేష్, ఫెరోజ్ ఇస్రాయిల్ లిరిక్స్ అందించడం గమనార్హం. ఒకటి, రెండు, మూడు వచ్చాడు అన్న చూడు, స్టేట్ అంతా వెతికి చూడు, ఎదురొచ్చేటోడే లేడు అంటూ ర్యాపర్స్ అసుర, ఫెరోజ్ ఇస్రాయిల్ పాడిన ఈ సాంగ్ ఆకట్టుకుంటోంది. ఈ అంథమ్ సాంగ్ లో చిరు పెర్ఫార్మన్స్ తో పాటు, లుక్స్, మేనరిజం అద్దిరిపోయేలా ఉన్నాయని అంటూ మెగా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.