యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా.. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్. కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణ మూవీస్ – యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఎట్టకేలకు విడుదల తేదీని ప్రకటించిన విషయం తెలిసిందే. మార్చి 11 న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక ఈ ప్రేమ కావ్యం నుంచి ఇప్పటికే రిలీజ్ అయినా సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా నేడు ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి స్పెషల్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. ప్రేమకు, విధిరాతకు మధ్య యుద్ధం అంటూ రిలీజ్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
‘మళ్ళీ లైఫ్ లో వాడి మొహం చూడను’ అని పూజ వాయిస్ తో మొదలైన ఈ వీడియోలో పూజ ముద్దు కోసం ప్రభాస్ పడిన కష్టాలను వినోదాత్మకంగా చూపించారు. ఇక చివర్లో పూజ చేత.. ప్రభాస్ పెళ్లి ఎందుకు కాలేదు అని అడిగించేశారు. ‘కుక్ చేస్తావ్.. బాగా మాట్లాడతావ్.. ఇంత మంచి అబ్బాయికి ఇంకా పెళ్ళెందుకు కాలేదు?’ అంటూ అనేసరికి ప్రభాస్ ఏం చెప్పాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్న ఫేస్ ఆకట్టుకొంటుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి ప్రభాస్ కి పెళ్లేందుకు కాలేదు అని తెలియాలంటే సినిమా చూడాల్సిందేమో అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి మార్చి 11 న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.