చారిత్రాత్మక దేవాలయంలో “రాధే శ్యామ్” షూటింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ “రాధే శ్యామ్” భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు ముఖ్యమైన ప్రాంతాల్లో సినిమా చిత్రీకరణను పూర్తి చేశారు మేకర్స్. ఈ సినిమా చివరి షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్, జమ్మలమడుగులోని గండికోటలో ఉన్న 15వ శతాబ్దపు దేవాలయంలో కంప్లీట్ చేశారు. కృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన ఈ దేవాలయం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. “రాధే శ్యామ్” రొమాంటిక్ ఎంటర్టైనర్ పీరియడ్ డ్రామా కాబట్టి ఈ మందిరాన్ని షూటింగ్ లొకేషన్‌గా ఉపయోగిస్తే సన్నివేశాలకు సరిగ్గా సరిపోవడమే కాకుండా ప్రేక్షకులకు సరైన అనుభూతిని కలిగిస్తుందని మేకర్స్ భావించారు.
జాతీయ అవార్డు గ్రహీత, ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ “నేను చాలా కాలం క్రితం ఈ ప్రదేశానికి వెళ్లాను. జూన్‌లో మా దేవాలయ సన్నివేశాలకు తగిన ప్రదేశాల కోసం మేము వెతుకుతున్నప్పుడు ఈ దేవాలయం అనువైనదని భావించాను. అదే సమయంలో మేము ప్రత్యేకంగా పూర్తిగా రాతితో నిర్మించిన ఆలయం కోసం చూస్తున్నాము. ఈ దేవాలయం మేము అనుకున్న సన్నివేశాలకు సరిగ్గా సరిపోతుంది. ఆలయ సన్నివేశాలు సినిమాలో చాలా కీలకమైనవి” అని చెప్పుకొచ్చారు.
Also Read
- Hanuman Ansh: 21 ఏళ్ల నిర్మాతకు జాక్ పాట్.. బాక్సాఫీస్ కలెక్షన్స్ 250 కోట్లు... ఓటీటీ డీల్ 100 కోట్లు?..
- Kashi Majili OTT: ‘కాశీ మజిలీ’తో రీఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్.. 'ఈటీవీ విన్'లో ఎమోషనల్ లవ్ స్టోరీ!
- Bigg Boss Hosts Salary 2026: బిగ్ బాస్ హోస్ట్‌లకు కోట్లలో రెమ్యునరేషన్, ఎవరు ఎంత తీసుకుంటున్నారంటే?
- Vishwambhara vs Kaaka: 'విశ్వంభర' vs 'కాకా'… సంక్రాంతి 2027 రేసులో మెగాస్టార్ ఏం చేయబోతున్నారు?
Read Also : లాంఛనంగా నితిన్ కొత్త సినిమా ప్రారంభం
అయితే సినిమా కోసం అక్కడ నవగ్రహ, హోమం స్థలం, ప్రాంగణం, నృత్య మందిరాన్ని ఫైబర్, కలపతో నిర్మించారు. మెటీరియల్ మొత్తం హైదరాబాద్ నుండి 12 ట్రక్కుల్లో రవాణా చేశారు. మరికొన్ని బనారస్ నుండి తెప్పించారు. ఈ షెడ్యూల్ కోసం వివిధ దేవాలయాలు, వేద విశ్వవిద్యాలయాల నుండి సుమారు 1,000 మంది వేద పండితులను తీసుకువచ్చారు. అందులో అఘోరాలు కూడా ఉన్నారట. ఆలయంలో వారం పాటు జరిగిన షూటింగ్ షెడ్యూల్ లో ఆధ్యాత్మికత ఉట్టిపడిందని ఆయన వెల్లడించారు. రవీందర్ రెడ్డి మాటలు ప్రభాస్ అభిమానుల్లో అంచనాలను పెంచేశాయి.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ఆమె డేంజరస్ ప్లేయర్.. త్వరగా ఔట్ చేయకుంటే ఓటమి ఖాయం.. హర్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
BRICS: మోడీ విందుకు జిన్‌పింగ్ డుమ్మా.. కారణం ఏంటంటే..?
-
8th Pay Commission: గుడ్ న్యూస్.. ఒక్క నిర్ణయంతో రూ.69 వేలకు చేరనున్న కనీస బేసిక్.. ఉద్యోగులు, పెన్షనర్లకు జాక్‌పాట్!
-
Hanuman Ansh: 21 ఏళ్ల నిర్మాతకు జాక్ పాట్.. బాక్సాఫీస్ కలెక్షన్స్ 250 కోట్లు… ఓటీటీ డీల్ 100 కోట్లు?..
-
CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!