NTV Telugu Site icon

raashikhaanna: హిందీలో సినిమా చేస్తే ఎలాంటి ఎగ్జైయిట్‌మెంట్‌ ఉండదు: రాశిఖన్నా

Untitled Design (36)

Untitled Design (36)

టాలీవుడ్ హీరోయిన్ లు చాలా మంది ఇక్కడ అవకాశాలు తగ్గిన వెంటనే బాలీవుడ్ వైపు మొగ్గు చూపుతున్నారు. అలా వెళ్లి బోల్తా పడిన వారు కొంత మంది అయితే, సక్సెస్ అందుకున్న వారు కొంత మంది. అలాంటి వారిలో రాశిఖన్నా ఒకరు.‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బబ్లీ బ్యూటీ తెలుగులో వరుసగా సినిమాలు చేసింది. యంగ్ హీరోలకు జోడీగా నటిస్తూ దూసుకుపోయింది ఈ అమ్మడు. అలాగే తమిళ్ లోనూ ఛాన్స్‌లు అందుకుంది. అక్కడ కూడా మంచి ఫేమ్ రావడంతో రాశిఖన్నాకు హిందీలో కూడా ఆఫర్ లు వస్తున్నాయి.

ఇందులో భాగంగా హిట్ ఫట్ ..అని కూడా చూడకుండా చిన్న పాత్ర అయినా సరే వచ్చిన ఆఫర్ చేసుకుంటూ పోతుంది. అంతేకాదు ముందు స్కిన్ షో కి దూరంగా ఉన్న ఈ చిన్నది ఇప్పుడు మాత్రం గ్లామర్ గేట్లు ఎత్తేసి కవ్విస్తుంది. ఈ మధ్య కాలంలో పోస్ట్ చేస్తున్న ఫోటోలు చూస్తే కుర్రకారుకు నిద్ర పట్టడం లేదు. ఆ రేంజ్ లో అందాలు ఆరబోస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా రాశి ఖన్నా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Also Read:Danush: 12 ఏళ్ల తర్వాత రిపీట్ కానున్న ఆ కాంబో

తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా రాశి కన్నా మాట్లాడుతూ.. ‘నాకు కమర్షియల్ సినిమాలంటే చాలా ఇష్టం. అలాంటి ఆఫర్లు వస్తే వెంటనే ఓకే చెప్పేస్తా. కానీ అలాంటి సినిమాలు చేయడానికి ఇంకా చాలా సమయం ఉంది.. నేను నటిగా ఎదగాలని ఎప్పటినుంచో కోరుకుంటున్నా. మంచి కంటెంట్‌ ఉన్న సినిమాల్లో అవకాశం వస్తే చాలు, ఆ సినిమానే మన ఎదుగుదలకు కారణం అవుతుంది. నటిగా నన్ను నేను గట్టిగా నిరూపించుకోవడానికి మరో అవకాశం దక్కుతుంది. అలాంటి గుర్తింపు ఉన్న సినిమాలు ఎక్కువగా చేయాలని కోరుకుంటున్నా. చాలా కాలంగా సౌత్‌లో సినిమాలు చేస్తున్నా.. కానీ అలాంటి చిత్రాలే హిందీలో చేస్తే ఎలాంటి ఎగ్జైయిట్‌మెంట్‌ ఉండదు. మనం చేసిన పాత్ర ఏళ్ళు గడిచిన ప్రేక్షకులు మాత్రం మనల్ని మర్చిపోకుండదు. అలాంటి పాత్ర ఇకటి చేసిన చాలు’ అని రాశిఖన్నా చెప్పుకొచ్చింది. ప్రజంట్ ఈ అమ్మడు మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.