“ఊహలు గుసగుసలాడే” సినిమాతో సౌత్ కు పరిచయమైన బ్యూటీ రాశి ఖన్నా. ఆ తరువాత తన అందం, ట్యాలెంట్ తో వరుస అవకాశాలను పట్టేస్తూ మంచి గుర్తింపును దక్కించుకుంది. ఇటీవల “రుద్ర” అనే హిందీ వెబ్ సిరీస్ లో మెరిసిన ఈ అమ్మడు యాక్టింగ్ పై ప్రశంసలు కురిశాయి. ఈ వెబ్ మూవీ ప్రమోషన్లలో గతంలో కొంతమంది హీరోయిన్లు చేసినట్టుగానే రాశిఖన్నా కూడా సౌత్ పై షాకింగ్ కామెంట్స్ చేసిందంటూ వార్తలు వచ్చాయి. కెరీర్ స్టార్టింగ్ లో తనను సౌత్ లో గ్యాస్ ట్యాంకర్ అన్నారని, రొటీన్ అంటే తనకు నచ్చదని, కానీ దక్షిణాదిలో అడుగు పెట్టాక ఆ రొటీన్ కే అలవాటు పడిపోయానని, ఇక్కడ అందాన్ని మాత్రమే చూస్తారని, హీరోయిన్లలో ట్యాలెంట్ ను చూడడం సౌత్ ప్రేక్షకులు అలవాటు చేసుకోవాలని, అంతేకాకుండా హీరోహీరోయిన్లకు సౌత్ లో ప్రత్యేకంగా ట్యాగులు ఇస్తారని, అది తనకు నచ్చదని, ఇక నుంచి తనలో, తాను ఎన్నుకునే కథల్లో కొత్త రాశి ఖన్నాను చూస్తారంటూ రాశి ఖన్నా చెప్పినట్టు గత వారం నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ వార్తలపై రాశి ఖన్నా స్పందిస్తూ సోషల్ మీడియాలో తాను అన్న మాటల గురించి వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు.
Read Also : KGF Chapter 2 : “ఎదగరా దినకరా” ఎమోషనల్ సాంగ్… వాయిస్ ఆఫ్ ఎవ్రీ మదర్
“సౌత్ సినిమాల గురించి చెడుగా మాట్లాడాను అంటూ నా గురించి కొన్ని కల్పిత, తప్పుడు కథనాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇలా ఎవరు చేస్తున్నారో వారిని దయచేసి ఆపమని నేను అభ్యర్థిస్తున్నాను. నేను చేసే ప్రతి భాష/చిత్రం పట్ల నాకు చాలా గౌరవం ఉంది” అంటూ అవన్నీ రూమర్లేనని కొట్టి పారేసింది. పైగా తనకు అన్ని భాషలపై, అన్ని భాషలపై సినిమాలపై గౌరవం ఉందంటూ స్పష్టంగా చెప్పేసింది. మరి ఇప్పటికైనా రాశిఖన్నా సౌత్ పై ఇలాంటి కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదని మండిపడుతున్న సౌత్ ప్రేక్షకులు శాంతిస్తారేమో చూడాలి.
https://twitter.com/RaashiiKhanna_/status/1511615813047914503