R Narayana Murthy : ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన కామెంట్లపై తాజాగా ఆర్.నారాయణ మూర్తి స్పందించారు. మెగాస్టార్ చిరంజీవి ప్రెస్ నోట్ లో చెప్పింది వంద శాతం నిజం. మమ్మల్ని గత వైసీపీ ప్రభుత్వం అవమానించలేదు. జగన్ ను కలిసిన వారిలో నేను కూడా ఉన్నాను. ప్రెస్ నోట్ లో చిరంజీవి నా పేరు ప్రస్తావించారు కాబట్టి నేను స్పందిస్తున్నాను. చిరంజీవి స్వయంగా నాకు ఫోన్ చేసి రమ్మన్నారు. అది చిరంజీవి సంస్కారం. సినీ ఇండస్ట్రీ సమస్యల గురించి చిరంజీవి ఆధ్వర్యంలో మాట్లాడేందుకు మేం తాడేపల్లి వెళ్లాం. అక్కడ మాకు ఎంతో గౌరవం ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం సినిమా వాళ్లను అవమానించలేదు. చిరంజీవిని వైసీపీ ప్రభుత్వం అవమానించిందంటూ తప్పుడు ప్రచారం చేశారు. అందులో నిజం లేదు.
Read Also : Manchu Manoj : నా వల్లే ఎన్టీఆర్ కు గాయం అయింది.. మనోజ్ కామెంట్స్
చిరంజీవి ఇండస్ట్రీ పెద్దగా జగన్ తో మాట్లాడారు. చిరంజీవి వల్లే సమస్య పరిష్కారం అయింది. ఇప్పటికీ ఆ సమస్యలు ఇండస్ట్రీలో అలాగే ఉన్నాయి. వాటిని కూటమి ప్రభుత్వం పరిష్కరించాలి. బాలకృష్ణ చెప్పిన దాని గురించి నేను మాట్లాడదలచుకోలేదు. ఆయనకు తెలిసింది ఆయన చెప్పారు. కానీ అందులో నిజం లేదు. సినిమా టికెట్ ధరలు పెంచొద్దు. ఎందుకంటే సామాన్యులకు సినిమాలను అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది అంటూ చెప్పుకొచ్చాడు ఆర్.నారాయణ మూర్తి. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చకు దారి తీస్తున్నాయి. బాలకృష్ణ మొన్న అసెంబ్లీలో మాట్లాడుతూ చిరంజీవిని అవమానించారంటూ కామెంట్ చేశారు. ఆ కామెంట్స్ పెద్ద దుమారానికి దారి తీశాయి. దానిపై చిరంజీవి ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
Read Also : Suhas : మళ్లీ తండ్రి అయిన యంగ్ హీరో
