పుష్ప సినిమా రిలీజ్ అయి ఆరు నెలలు దాటిపోయింది. అయినా ఇప్పటి వరకు సెకండ్ పార్ట్ షూటింగ్ మొదలు పెట్టలేదు. అయితే పార్ట్ వన్‌తో అంచనాలు పెరగడంతో.. సీక్వెల్‌ను పకడ్బందిగా ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. అందుకే లేట్ అవుతున్నట్టు తెలుస్తోంది. కానీ లేటెస్ట్ అప్టేట్ ప్రకారం పుష్పరాజ్ వేట మొదలైపోయిందని సమాచారం. అయితే ముందుగా నటీనటుల వేటలో పడిందట సుకుమార్ టీమ్.. మరి పుష్పరాజ్ ఏం చేస్తున్నాడు..?
పుష్ప మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలవడంతో.. పుష్ప టు పై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. అందుకే తొందరపడకుండా.. అన్ని విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు డైరెక్టర్ సుకుమార్. ముందుగా అనుకున్న స్క్రిప్ట్ కాకుండా.. ఈ సారి స్క్రిప్ట్‌లో భారీ మార్పులు చేర్పులు చేసినట్టు తెలుస్తోంది. బన్నీ కూడా కాస్త ఆలస్యం అయినా పర్వాలేదు కాని పుష్ప 1 మించి.. పుష్ప 2 కూడా ఉండాలనే పట్టుదలతో ఉన్నాడట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం కోసం.. సుకుమార్ నటీ నటుల ఎంపిక మొదలు పెట్టాడట. అయితే మెయిన్ క్యారెక్టర్స్ పుష్ప వన్‌లో ఉన్నవే కంటిన్యూ అయినప్పటికీ.. పుష్ప 2లో మాత్రం కొన్ని కొత్త పాత్రలు ఎంట్రీ ఇవ్వబోతున్నాయట. దాంతో ఆ పాత్రల కోసం ఆడిషన్స్ ను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట. అందుకు సంబంధించిన ఓ బ్యానర్ పోస్టర్ కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈనెల 10వ తారీకున ఆడిషన్స్ ను నిర్వహించేందుకు.. సుకుమార్ టీం ఇప్పటికే ఓ జాబితా తయారు చేసినట్లుగా తెలుస్తోంది. రెండు నుండి నాలుగు రోజుల పాటు పలు పాత్రలకు ఈ ఆడిషన్స్ నిర్వహిస్తారట. ఈ సారి బాలీవుడ్ బడా స్టార్స్ ను కూడా తీసుకోబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దాంతో ఎట్టకేలకు పుష్ప2 పనులు మొదలైపోయినట్టేనని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఇప్పటికే లొకేషన్ ఫైనలైజ్ చేసిన సుక్కు టీమ్.. అతి త్వరలో షూటింగ్ స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.