పుష్ప ది రైజ్ సినిమాలో కేశవగా నటించి మెప్పించాడు ప్రతాప్ అలియాస్ జగదీష్. మంచి భవిష్యత్తు ఉన్న నటుడిగా పేరు తెచ్చుకున్న జగదీష్ ని ఇటీవలే పంజాగుట్టా పోలీసులు ఒక అమ్మాయి ఆత్మహత్య కేసులో అరెస్ట్ చేసారు. మరణించిన అమ్మాయి తండ్రి, తన కూతురు చనిపోవడానికి జగదీశ్ కారణమని కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు అదుపులోకి తీసుకోని విచారించారు. ఈ విచారణలో జగదీశ్ నేరం ఒప్పుకున్నట్లు సమాచారం. ఒకప్పుడు జగదీష్ తో క్లోజ్ గా అమ్మాయి, ఇటీవలే వేరే అబ్బాయితో సన్నిహితంగా ఉండడం భరించలేకనే ఆమెని బెదిరించాను అంటూ తప్పు ఒప్పుకున్నాడు జగదీశ్.
Read Also: Pushpa Jagadeesh: బ్రేకింగ్.. యువతి ఆత్మహత్య.. పుష్ప నటుడు అరెస్ట్
జూనియర్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పటి నుంచి ఆ యువతీతో సన్నిహితంగా ఉన్న జగదీష్… శారీరికంగా కూడా కలిసున్నాడు. ఇటీవలే పుష్ప సినిమాతో క్రేజ్ రావడంతో యువతిని దూరం పెట్టడం మొదలుపెట్టాడు. ఆ అమ్మాయి ఇది తట్టుకోలేక వేరొక అబ్బాయితో సన్నిహితంగా ఉండడం మొదలుపెట్టింది. ఇది భరించలేకపోయిన జగదీశ్… గత నెల 27న యువతి ఇంటికి వెళ్లి, అబ్బాయితో ఆమె సన్నిహితంగా ఉన్న ఫొటోలు తీశాడు. వాటిని ఆమెకు పంపి తన మాట వినకుంటే సోషల్ మీడియాలో పోస్టు చేస్తానంటూ బెదిరించాడు. దీంతో ఆమె భయపడి గత నెల 29న ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇదిలా ఉంటే ఇప్పుడు జగదీష్ నేరం ఒప్పుకోవడంతో పుష్ప ది రూల్ సినిమా షూటింగ్ ట్రబుల్ లో పడింది. ఇప్పటికే జగదీశ్ బెయిల్ కోసం పుష్ప 2 మేకర్స్ 15 లక్షలు ఖర్చు పెట్టినట్లు సమాచారం. డూప్ తో షూట్ చేసే ప్రయత్నాలు కూడా జరిగాయి కానీ అవేమి వర్కౌట్ అవ్వలేదు. మరి సుకుమార్ తన ఇంటెలిజెన్స్ తో పుష్ప 2 షూటింగ్ ఆగకుండా క్రియేటివ్ గా ఏదైనా ప్లాన్ చేస్తాడేమో చూడాలి.