పుష్ప ది రైజ్ సినిమాలో కేశవగా నటించి మెప్పించాడు ప్రతాప్ అలియాస్ జగదీష్. మంచి భవిష్యత్తు ఉన్న నటుడిగా పేరు తెచ్చుకున్న జగదీష్ ని ఇటీవలే పంజాగుట్టా పోలీసులు ఒక అమ్మాయి ఆత్మహత్య కేసులో అరెస్ట్ చేసారు. మరణించిన అమ్మాయి తండ్రి, తన కూతురు చనిపోవడానికి జగదీశ్ కారణమని కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు అదుపులోకి తీసుకోని విచారించారు. ఈ విచారణలో జగదీశ్ నేరం ఒప్పుకున్నట్లు సమాచారం. ఒకప్పుడు జగదీష్ తో క్లోజ్ గా అమ్మాయి, ఇటీవలే వేరే…