పాన్ ఇండియా మూవీ “పుష్ప” నుంచి నిన్న “దాక్కో దాక్కో మేకా” లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ పాట తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ వంటి 5 భాషలలో విడుదలైంది. విశాల్ దడ్లాని (హిందీ), విజయ్ ప్రకాష్ (కన్నడ), రాహుల్ నంబియార్ (మలయాళం), శివమ్ (తెలుగు), బెన్నీ దయాళ్ (తమిళ్) ఐదు వెర్షన్లలో పాడారు. అల్లు అర్జున్ కఠినమైన లుక్, మినిమలిస్టిక్ డ్యాన్స్ కదలికలు ఈ పాటలో హైలైట్. ఐకాన్ స్టార్ సాధారణంగా తెరపై చాలా ఉత్సాహంగా కన్పిస్తాడు. కానీ “పుష్ప”లో మునుపెన్నడూ లేని విధంగా తీవ్రమైన, క్రూరమైన లుక్ లో కన్పించాడు. పాట బీట్‌లు ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ, సంగీతం, సాహిత్యం కొన్ని చోట్ల తడబడ్డట్టుగా అన్పించింది. పాట ప్రెజెంటేషన్ అద్భుతంగా ఉంది.
Read Also : నాగశౌర్య ‘లక్ష్య’లో రితికాగా మెస్మరైజ్ చేసిన కేతిక!
వీడియో యానిమేషన్, ఎడిటింగ్ అగ్రస్థానంలో ఉన్నాయి. మిరోస్లా క్యూబా బ్రోజెక్ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. సంగీతం కంటే విజువల్స్ కారణంగా ఈ పాట రికార్డులు కొల్లగొడుతోంది. విడుదలైన 371 మినిట్స్ లో 500కే వ్యూస్ తో ఆల్ టైం రికార్డు సృష్టించాడు “పుష్ప”రాజ్. ప్రస్తుతం ఈ వీడియో 1 మిలియన్ లైక్స్ తో యూట్యూబ్ లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. 5 భాషల్లో కలిపి 10 మిలియన్ కు పైగా వ్యూస్ సాధించింది. మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్ “పుష్ప : ది రైజ్ పార్ట్ 1” 2021 క్రిస్మస్ కానుకగా విడుదలకు సిద్ధంగా ఉంది.