ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప: ది రైజ్” చిత్రానికి అరుదైన గౌరవం లభించింది. డిసెంబర్ 17న పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ చిత్రం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించింది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ముఖ్యంగా హిందీలో ఈ మూవీ ఫైర్ మామూలుగా లేదు. ఈ చిత్రం బాలీవుడ్‌లో భారీ కలెక్షన్స్ రాబట్టింది. అల్లు అర్జున్ నటనపై అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపించారు. ఇక ఇప్పుడు “పుష్ప” మూవీ ఆఫ్ ది ఇయర్ గా నిలిచింది. ఈ చిత్రం ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్ 2022ని సొంతం చేసుకుంది. అనేక బాలీవుడ్ చిత్రాలను అధిగమించి “పుష్ప: ది రైజ్” ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక కావడం విశేషం. బెస్ట్ షార్ట్ ఫిల్మ్ గా ‘మనసానమః’ చోటు సంపాదించుకుంది. దీపక్ దర్శకత్వంలో రూపుద్దిద్దుకున్న ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ‘మనసానమః’.
Read Also : Puri Jagannadh : డాషింగ్ డైరెక్టర్ డేరింగ్ స్టెప్… ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ కు సన్నాహాలు
’83’లో నటనకు గాను రణ్‌వీర్ సింగ్ ఉత్తమ నటుడు, ‘మిమీ’ చిత్రానికి గాను కృతి సనన్ ఉత్తమ నటిగా అవార్డును అందుకున్నారు. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘సర్దార్ ఉధమ్ సింగ్’ క్రిటిక్స్ బెస్ట్ ఫిల్మ్‌గా, ‘షేర్షా’ ఉత్తమ చిత్రంగా అవార్డులు అందుకున్నాయి. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ ఇద్దరు స్టార్స్ వరుసగా క్రిటిక్స్ ఉత్తమ నటుడు, నటి అవార్డులను గెలుచుకున్నారు. మనోజ్ బాజ్‌పేయికి వెబ్ సిరీస్‌లో ఉత్తమ నటుడు అవార్డు లభించింది. వెబ్ సిరీస్‌లో రవీనా టాండన్ ఉత్తమ నటిగా ఎంపికైంది. ఈ ఈవెంట్ నిన్న రాత్రి ముంబైలో జరిగింది.