Pushpa 2nd Single Update: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప 2 మీద భారీ అంచనాలు ఏర్పడిన సంగతి అందరికీ తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన పుష్ప మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగం మీద ప్రేక్షకులలో అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను మరింత పెంచే విధంగా సినిమా ప్రమోషనల్ కంటెంట్తో ముందుకు తీసుకెళ్తుంది యూనిట్. అందులో భాగంగా ఈ మధ్యనే పుష్ప రాజ్ అనే ఒక సాంగ్ రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు సినిమా నుంచి సెకండ్ సింగల్ రిలీజ్ చేసేందుకు యూనిట్స్ సిద్ధమైంది. అనౌన్స్మెంట్ వీడియోకి సంబంధించిన టైం మెన్షన్ చేస్తూ ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు.
Maidaan OTT: ఓటీటీలోకి అజయ్ దేవ్‌గణ్ ‘మైదాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
శ్రీవల్లి అనౌన్స్మెంట్ వీడియో ఇస్తోంది, అని రేపు ఉదయం 11 గంటల 7 నిమిషాలకు ఈ అనౌన్స్మెంట్ వీడియో ఉంటుందని సినిమా యూనిట్ ప్రకటించింది. అయితే ఒకప్పుడు ఆడియో రిలీజ్ అనే పేరుతో ఒకేసారి సినిమాలో ఆయన ఐదారు పాటలను రిలీజ్ చేసే వాళ్ళు. తర్వాత లిరికల్ సాంగ్స్ అని ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ లిరికల్ సాంగ్స్ కి కూడా ప్రోమోలంటూ రిలీజ్ చేస్తున్నారు. ఆ ప్రోమో కి కూడా ఒక అనౌన్స్మెంట్ వీడియో అని, ఆ వీడియోకి మరో పోస్టర్ వదలడం చూస్తుంటే ఈ ప్రమోషన్స్ పీక్స్ లో ఉన్నాయంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.