NTV Telugu Site icon

Pushpa 2 The Rule: రూల్ చేసేందుకు ‘పుష్ప’గాడు దిగుతున్నాడు..రిలీజెప్పుడో చెప్పేశారు!

Pushpa 2 Release Date

Pushpa 2 Release Date

Pushpa 2 The Rule Release Date: ప్రస్తుతం సెట్స్ పై ఉన్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాల్లో పుష్ప2 టాప్ ప్లేస్‌లోకి వెళ్ళింది. ఈసారి దానికి తోడు పుష్ప సినిమాతో అల్లు అర్జున్ బెస్ట్‌ యాక్టర్‌గా నేషనల్ అవార్డ్ అందుకున్న క్రమంలో పుష్ప 2 పై ఉన్న అంచ‌నాలు రెట్టింపు అయ్యాయి. ఇప్పటికే పుష్ప2ని నెక్స్ట్ లెవల్ అనేలా తెరకెక్కిస్తున్న సుకుమార్ నేషనల్ అవార్డ్ ఇచ్చిన బూస్టింగ్‌తో ఇంకెలా డిజైన్ చేస్తాడో ఊహించుకోవచ్చని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే ఏ విషయంలో కాంప్రమైజ్ అవకుండా పుష్ప2ని పుష్ప పార్ట్ వన్ లైఫ్ టైం కలెక్షన్ల కంటే ఎక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.

ఇప్పటికే సుకుమార్‌కు అన్ లిమిటేడ్ బడ్జెట్ తో సినిమా చేసుకోమని మైత్రీ మూవీ మేకర్స్ ఆఫర్ ఇచ్చినట్టు కూడా టాక్ ఉంది. అవుట్ పుట్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా సినిమాను జక్కన్నలాగా మారి చెక్కుతున్నాడు. ఈ సినిమా నుంచి గతంలో రిలీజ్ అయిన వేర్ ఈజ్ పుష్ప వీడియో, బన్నీ అమ్మవారి గెటప్ హైప్‌ను పీక్స్‌కు తీసుకెళ్లగా ఈ సినిమా థియేటర్లోకి ఎప్పుడొస్తుంది? అనే విషయంలో కొన్నాళ్ల నుంచి రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇక ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేసింది. ఈ సినిమాను ఆగస్టు 15 2024న రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది.

అంటే ఒక రకంగా ఆ నెలలో లాంగ్ వీకెండ్ ను టార్గెట్ చేసినట్టు అనిపిస్తోంది. ఎందుకంటే ఆగస్టు 15 గురువారం నాడు రిలీజ్ చేస్తున్నారు, ఇక శుక్రవారం ఒక్కరోజు వర్కింగ్ ఉండే ఉంటుంది, ఆ తరువాత శని, ఆదివారాలు కూడా సినిమాకి కలిసి రానున్నాయి. పాన్ ఇండియా లెవల్లో సెలవు దొరికే రోజు కావడంతో పుష్ప యూనిట్ వ్యూహాత్మకంగా ఆరోజునే సినిమా రిలీజ్ చేస్తున్నట్టు చెప్పొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆగస్టు 15-18 వరకు లాంగ్ వీకెండ్ ఉండగా, ఆ తరువాతి రోజు దేశవ్యాప్తంగా జరుపుకునే రాఖీ పండుగ వచ్చింది. ఇక ఆగస్టు 26న నార్త్ లో ఎక్కువ జరుపుకునే శ్రీకృష్ణ జన్మాష్టమి జరగనుంది. ఇక మరో పదిరోజులకు వినాయక చవితి కూడా ఉంది.

Sameera Sherief: రక్తమోడే ఫోటో షేర్ చేసిన నటి.. అసలు ఏమైంది?

Show comments