NTV Telugu Site icon

Kissik : కిస్సిక్.. దెబ్బలు పడతాయి జాగ్రత్త

Kissik

Kissik

గత కొంతకాలంగా పుష్పా 2 టీం ఊరిస్తూ వస్తున్న కిస్సిక్ సాంగ్ ఎట్టకేలకు రిలీజ్ అయింది. శ్రీ లీల డాన్స్ చేసిన ఈ సాంగ్ ని పుష్ప 2కి స్పెషల్ సాంగ్ గా అభివర్ణిస్తూ వస్తున్నారు. పుష్ప మొదటి భాగంలో సమంత చేసిన యూ అంటావా అంటావా అనే సాంగ్ సూపర్ హిట్ కావడంతో ఈ రెండో సినిమాలో ఎలాంటి సాంగ్ పెడతారా అని ముందు నుంచి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చారు. అందుకు తగ్గట్టుగానే కిసిక్ అనే సాంగ్ ని ఈరోజు చెన్నై ఈవెంట్ లో లైవ్ పెర్ఫార్మన్స్ చేసి మరీ రిలీజ్ చేయించారు. ఇక ఈ సాంగ్ వినడానికి ఆసక్తికరంగా ఉంది.

Also Read: Satyadev : రివ్యూ రైటర్స్ మరోసారి మా సినిమా చూడాలి!

డబుల్ మీనింగ్ మాటలతో మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఈ సాంగ్ కనిపిస్తోంది. ముఖ్యంగా బీ,సీ సెంటర్ ఆడియన్స్ ప్రధాన టార్గెట్గా ఈ సాంగ్ సిద్ధం చేసినట్లు కనిపిస్తోంది. మొదటి భాగం లాగానే ఈ సాంగ్ కూడా పార్టీ థీమ్ లోనే సెట్ చేశారు. అయితే శ్రీ లీల మామూలుగానే డాన్స్ ఇరగదీసేస్తుంది. ఇక ఈ సాంగ్ కోసం ఎలాంటి డాన్స్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది అనేది మాత్రం ఫుల్ వీడియో రిలీజ్ అయితే కానీ చెప్పలేం. ఇక ఈ సాంగ్ మీద ఇప్పటి వరకు అయితే మిశ్రమ స్పందన లభిస్తోంది. భవిష్యత్తులో చార్ట్ బాస్టర్ అయినా ఆశ్చర్యం లేదు.

Show comments