Allu Arjun : పుష్ప2లో అదే హైలెట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెండు భాగాలుగా వచ్చిన బాహుబలి.. కెజియప్.. సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపాయి. ఇదే ఫార్ములాతో రాబోతోంది పుష్ప మూవీ. అందుకే సెకండ్ పార్ట్‌ను భారీ బడ్జెట్‌తో.. బాలీవుడ్ ఆడియెన్స్ టార్గెట్‌గా.. భారీగా ప్లాన్ చేస్తున్నాడు. తాజాగా ఒక్కసారిగా మరింత అంచనాలను పెంచేశాడు సుకుమార్. మరి సుక్కు పుష్ప2 గురించి ఏం చెప్పాడు.. ఎలా ప్లాన్ చేస్తున్నాడు..?
Also Read
- IRUMUDI : ఇరుముడి గ్లిమ్స్ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్
- Peddi Ticket Booking :"పెద్ది" ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్... టికెట్ బుకింగ్స్ షురూ
- Spirit shooting : మైత్రీ విమల్ థియేటర్ లో 'స్పిరిట్' షూటింగ్.. ప్రభాస్ పై సీన్స్ తీస్తున్న వంగ
- Sobhita dhulipala : ప్రళయానంతర ప్రపంచంలో కథ... 'వెట్టువం'పై అంచనాలు పెంచిన శోభిత కామెంట్స్
గతేడాది ఎండింగ్‌లో వచ్చిన పుష్ప మూవీ ఎంత సంచలనంగా నిలిచిందో అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్.. ఆర్య, ఆర్య2 తర్వాత హ్యాట్రిక్ హిట్ కొట్టి.. పుష్ప మూవీతో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటారు. దాంతో పుష్ప 2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో.. ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వకముందే.. భారీ బినెస్ డీల్స్ వస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం భారీ ఆఫర్స్ వస్తున్నట్టు వినిపించింది. ఇక ఇప్పుడు ఓవర్సీస్ రైట్స్ కోసం అదిరొపోయే ఆఫర్ వచ్చినట్టు టాక్. ఎంతలా అంటే.. బాహుబలి, RRR రేంజ్‌లో పుష్ప2 ఓవర్సీస్ రైట్స్ భారీ ధర పలుకుతోందట. అయితే అప్పుడే పుష్పరాజ్ బిజినెస్ చేశాడా.. లేదా అనేది అనుమానమే. ఇదిలా ఉంటే.. తాజాగా పుష్ప 2లో హైలెట్ ఇదేనంటూ.. ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు సుకుమార్.
పుష్ప పార్ట్ వన్‌లో.. మళయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో.. విలన్‌గా నటించిన సంగతి తెలిసిందే. దాంతోసెకండ్ పార్ట్‌లో అల్లు అర్జున్, ఫాహద్ ఫాజిల్ మధ్య వచ్చే సీన్స్ హైలైట్ గా నిలువనుందని చెప్పుకొచ్చాడట సుకుమార్. అలాగే ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ ఇంకా ఇంప్రెసివ్ గా ఉంటుందనీ, కొన్ని సీన్స్ అయితే అబ్బురపరుస్తాయని చెప్పాడట. దాంతో ఈ సారి సుకుమార్.. దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో.. అంతకు మించి అనేలా ప్లాన్ చేస్తున్నాడని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాను జులై నుంచి షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. వీలైతే వచ్చే ఏడాది సమ్మర్.. లేదా డిసెంబర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి రోజు రోజుకి అంచనాలు పెంచేస్తున్న పుష్ప2.. ఎలా ఉంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Virat Kohli Watch Price: ఆ ఒక్క వాచ్ తో ఓ కుటుంబం లైఫ్ టైం సెటిల్ కదయ్యా.. RCB సంబరాల్లో కోహ్లీ వాచ్ హాట్ టాపిక్.!
-
Annamalai: కొత్త పార్టీ పెడతారా?.. బీజేపీకి గుడ్‌బై చెప్పనున్నారా? అన్నామలై నిర్ణయంపై ఉత్కంఠ..!
-
Vaibhav Sooryavanshi Earnings: ఐపీఎల్ 2026లో వైభవ్ ఎంత సంపాదించాడో తెలుసా?.. లెక్కలు తెలిస్తే మైండ్ బ్లాకే!
-
Ponnam Prabhakar – Pawan Kalyan: తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్..
-
Viral Video: దగ్గు సిరప్ నాకుతున్న బల్లి.. డేంజర్ తప్పదా? ఈ లిజెర్డ్ ఎందుకిలా చేస్తుంది?
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!