అస్సలు వాయిదా పడే ఛాన్సే లేదు… ఎట్టి పరిస్థితుల్లోను ఆగష్టు 15న థియేటర్లోకి రావాలని ఫిక్స్ అయిపోయాడు పుష్పరాజ్. ప్రస్తుతం పుష్ప2 షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. రామోజీ ఫిలిం సిటీలో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. సినిమాలో పుష్పరాజ్ ఫ్రెండ్‌గా నటించిన కేశవ తిరిగి సెట్స్ లోకి అడుగుపెట్టడంతో… ఆర్‌ఎఫ్‌సీ షెడ్యూల్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు సుకుమార్. గంగమ్మ జాతర బ్యాక్ డ్రాప్ సీన్స్ షూట్ చేస్తున్నారు. దాదాపు 40 రోజుల పాటు జరిగిన గంగమ్మతల్లి జాతర సీక్వెన్స్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒకప్పటి జానీ మాస్టర్ అసిస్టెంట్ ఇప్పటి ఖోరియోగ్రాఫర్ శ్రేష్ఠి వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. జంగమ్మతల్లి జాతర సీక్వెన్స్ ని శ్రేష్ఠి ఖోరియోగ్రాఫ్ చేసింది.
40 రోజుల పాటు జరిగిన ఈ ఎపిసోడ్ ఆన్ స్క్రీన్ పైన దాదాపు 12 నిమిషాల పాటు ఉంటుంది. పుష్ప 2 సినిమాకే ఈ ఎపిసోడ్ హైలైట్ గా నిలుస్తుందని టాక్. ఫస్ట్ లుక్ పోస్టర్ లోనే అల్లు అర్జున్ గంగమ్మతల్లి గెటప్ లో కనిపించి ఇండియా మొత్తం పుష్ప 2 గురించి మాట్లాడుకునే చేసాడు. ఇక ఈ ఎపిసోడ్ ని థియేటర్ లో చూస్తే దాని ఇంపాక్ట్ ఏ రేంజులో ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక నెక్ట్స్ షెడ్యూల్‌ను విదేశాల్లో ప్లాన్ చేస్తున్నారట. గత కొద్ది రోజులుగా జపాన్‌లో పుష్పరాజ్‌తో భారీ ఫైట్ ఉంటుందని… సినిమాని నెక్స్ట్ లెవల్ తీసుకోని వెళ్లేలా ఈ ఎపిసోడ్ ఉంటుందట. ఈ షెడ్యూల్ కోసం జపాన్ ఫ్లైట్ ఎక్కడానికి రెడీ అవుతున్నాడట పుష్పరాజ్. యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జపాన్ లొకేషన్స్‌లో జరుగుతుందని సమాచారం. వీలైనంత తర్వాత పుష్ప2 షూటింగ్ కంప్లీట్ చేయాలని చూస్తున్నాడు సుకుమార్. పార్ట్ 1 కంటే పార్ట్ 2న మరింత గ్రాండియర్‌గా తెరకెక్కిస్తున్నాడు. ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా.. అనుకున్నదానికంటే ఎక్కువ బడ్జెట్ ఖర్చు చేస్తున్నారట మేకర్స్.