Site icon NTV Telugu

HHVM : పుష్ప-2తో పోయింది.. ’వీరమల్లు’తో మొదలవుతుందా….?

Hhvm Pre Release Event

Hhvm Pre Release Event

HHVM : సినిమా టికెట్ రేట్ల విషయంలో కర్ణాటక ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఏ థియేటర్ లో అయినా అన్ని సినిమాల టికెట్ రేట్లు రూ.200 మించకూడదని జీవో జారీ చేసింది. ఇది ఒక రకంగా మంచిదే అనుకోవాలి. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు టికెట్ రేట్లు పెంచుకుంటే ఆడియెన్స్ నుంచి వ్యతిరేతక వస్తోంది. ఈ నిర్ణయం ఇప్పుడు ఆడియెన్స్ ను సినిమాలకు దగ్గర చేసేలాగానే కనిపిస్తోంది. అయితే తెలంగాణలో టికెట్ల రేట్లను చూస్తే పుష్ప-2కు సినిమాను బట్టి ఇష్టారీతని పెంచుకునేవారు. పుష్ప-2 నుంచి సినిమాల టికెట్ రేట్లను పెంచడం ప్రభుత్వం ఆపేసింది.

Read Also : Kannappa : రాష్ట్రపతి భవన్ లో కన్నప్ప మూవీ ప్రదర్శన..

పవన్ కల్యాణ్‌ నుంచి వస్తున్న హరిహర వీరమల్లు మూవీతో ఈ ట్రెండ్ మళ్లీ స్టార్ట్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. ఆ మధ్య నిర్మాత ఏఎం రత్నం తెలంగాణలో టికెట్ల రేట్ల విషయంపై సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. రేవంత్ కూడా కొంత సానుకూలంగానే కనిపించారు. కానీ అప్పుడు మూవీ వాయిదా పడింది. ఇప్పుడు రిలీజ్ కు ఇంకో 12 రోజుల టైమ్ ఉంది. ఈ లోగా మరోసారి టికెట్ రేట్ల విషయంపై చర్చలు జరుపుతారని తెలుస్తోంది. చూస్తుంటే వీరమల్లు సినిమాకు టికెట్ రేట్లను తెలంగాణలో పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరీ ఎక్కువ కాకపోయినా ఎంతో కొంత పెంచుకోవడానికి వీలు కల్పిస్తారంట. ఈ సినిమాలో తెలంగాణ చరిత్ర గురించి కూడా ఉండటం ఇక్కడ కీలకంగా మారుతోంది.

Read Also : Telangana : తెలంగాణలో తగ్గిన ఎంపీటీసీల సంఖ్య

Exit mobile version