Purusha : భార్యల టార్చర్లు, మగాళ్ల కష్టాలు..క్షేమంగా వెళ్లి లాభంగా రండి వైబ్’లో ‘పురుష:’ ట్రైలర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన తాజా చిత్రం ‘పురుష:’. కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల సరస్వతి సమర్పణలో బత్తుల కోటేశ్వరరావు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నారు. వీరు వులవల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ స్పీడ్ పెంచుతూ ఆద్యంతం వినోదభరితంగా సాగే ట్రైలర్‌ను విడుదల చేసింది.
“బ్రహ్మచారి భర్తగా మారాలని నిర్ణయించుకున్న తరువాత జీవితం యుద్ధభూమిలా మారుతుంది” అనే స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ మార్క్ డైలాగ్‌తో ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత వచ్చే సీన్లు, భార్యల చేతిలో భర్తలు పడే తిప్పలు, నలిగిపోయే తీరు థియేటర్లలో నవ్వుల పూయించడం ఖాయమనిపిస్తోంది. “పెళ్లాం తిట్టినప్పుడు మన లోపల ఉన్న మగాడు పవర్ ఫుల్‌గా బయటకు వస్తాడు” లాంటి పంచ్ డైలాగ్స్ భర్తలకు బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. కేవలం కామెడీ మాత్రమే కాకుండా.. “ప్రేమ ఉన్న చోట నిజాయితీ ఉంటుంది.. నిజాయితీ లేని నీలాంటి వాడితో నేను ఉండలేను” అనే సంభాషణలతో కథలో మంచి ఎమోషనల్ టర్న్ కూడా ఉంటుందని ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. మొత్తానికి ఫ్యామిలీ, యూత్, మాస్ ఇలా అన్ని వర్గాల ఆడియన్స్‌ను మెప్పించే అంశాలతో ఈ ట్రైలర్‌ను కట్ చేశారు. ఈ చిత్రాన్ని మే 22న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. సప్తగిరి, కసిరెడ్డి రాజ్‌కుమార్, వెన్నెల కిషోర్ వంటి క్రేజీ కాంబినేషన్ ఉండటంతో ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో మంచి అంచనాలే ఉన్నాయి.
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!