Purusha: హీరోని ఎగరేసి తంతున్న హీరోయిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భార్యాభర్తల పోరుని వినోదాత్మకంగా చూపించిన ప్రతీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అలాంటి ఫ్యామిలీ కథతో వచ్చే కామెడీ ఎంటర్టైనర్లు ఎవర్ గ్రీన్‌గా నిలుస్తుంటాయి. ఇక ఇప్పుడు అలాంటి ఓ కథతోనే ప్రస్తుత తరానికి తగ్గట్టుగా ట్రెండీ మేకింగ్‌తో ‘పురుష:’ అనే చిత్రం రాబోతోంది. బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు ‘పురుష:’ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాకు వీరు వులవల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. మామూలుగా అయితే సినిమా నుంచి టీజర్, ట్రైలర్‌లాంటి కంటెంట్లు బయటకు వస్తే ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంటుంది.
Also Read :Nayanthara: చిరు మూవీతో.. కొత్త వివాదంలో చిక్కుకున్న నయనతార
Also Read
- Movie Interval: సినిమా మధ్యలో ‘ఇంటర్వెల్’ ఎందుకు వస్తుందో తెలుసా?.. పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ కోసం కాదు.. అసలు కారణం ఏంటంటే?
- Sandeepa Virk: మురికి టాయిలెట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్.. జైలులో బట్టలు విప్పించారు.. కన్నీళ్లు పెట్టుకున్న నటి!
- Daayra: స్టార్ కాస్ట్ ఉన్నంత మాత్రాన సినిమా హిట్ కాదు.. అమితాబ్-రేఖలను ఉదాహరణగా చూపించిన పృథ్వీరాజ్
- Samantha: పిల్లలు లేకపోయినా ఓకే అనుకున్నాం.. అదే సమయంలో ఈ గుడ్ న్యూస్.. ప్రెగ్నెన్సీపై సమంత షాకింగ్ కామెంట్స్!
కానీ ‘పురుష:’ టీం మాత్రం కేవలం పోస్టర్లు, ఫస్ట్ లుక్స్‌తోనే జనాల్లో ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశారు. ఇప్పటి వరకు హీరోల పాత్రలు, వారి బిహేవియర్, పాత్రల తీరుకి తగ్గట్టుగా పరిచయం చేసిన పోస్టర్లు అందరినీ నవ్వించేశాయి. ఇక ఇప్పుడు హీరోయిన్ల పాత్రల స్వభావాన్ని తెలియజేసేలా పోస్టర్లను విడుదల చేస్తూ అందరిలోనూ ఆసక్తిని పెంచేస్తున్నారు. ఈ క్రమంలో హీరోయిన్ వైష్ణవి పాత్రని ‘కంటి చూపుతో కాదు కన్నీళ్లతో చంపేస్తా’ అని పరిచయం చేశారు. అంటే ఆ పాత్ర పూర్తి ఎమోషనల్‌గా సాగేలా ఉంది. ‘పాపం అల్లాడి పోతున్నాడమ్మ బిడ్డ’ అనే క్యాప్షన్‌తో హాసిని పాత్రని పరిచయం చేశారు. ఇక ఆమె పాత్ర పూర్తి రెబల్‌గా ఉంటుందని అర్థం అవుతోంది. ఇక విషిక కారెక్టర్‌కు సంబంధించిన పోస్టర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. వైష్ణవి, హాసిని కంటే విషిక పాత్ర మరింత ఇంట్రెస్టింగ్గా ఉండేలా కనిపిస్తోంది. విషిక చేతిలో కసిరెడ్డి రాజ్ కుమార్ నలిగిపోయేలా ఉన్నాడు. కాలితో తంతే.. గాల్లోకి ఎగిరాడు అన్నట్టుగా విషిక పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రివీల్ చేశారు. దమ్ముంటే టచ్ చేసి చూడు అంటూ టీ షర్ట్ మీద కనిపిస్తున్న క్యాప్షన్ చూస్తుంటే విషిక ఈ మూవీలో రఫ్ఫాడించేలా ఉంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్‌గా సతీష్ ముత్యాల, సంగీత దర్శకుడుగా శ్రవణ్ భరద్వాజ్, ఎడిటర్‌గా కోటి, ఆర్ట్ డైరెక్టర్‌గా రవిబాబు దొండపాటి పని చేస్తున్నారు.
తాజావార్తలు
-
Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
-
Mahindra Thar 2026: ఆఫ్‌రోడ్ ప్రియులకు గుడ్ న్యూస్.. సరికొత్త లుక్‌తో మళ్లీ రాబోతున్న మహింద్రా థార్..!
-
Movie Interval: సినిమా మధ్యలో ‘ఇంటర్వెల్’ ఎందుకు వస్తుందో తెలుసా?.. పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ కోసం కాదు.. అసలు కారణం ఏంటంటే?
-
Sandeepa Virk: మురికి టాయిలెట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్.. జైలులో బట్టలు విప్పించారు.. కన్నీళ్లు పెట్టుకున్న నటి!
-
Daayra: స్టార్ కాస్ట్ ఉన్నంత మాత్రాన సినిమా హిట్ కాదు.. అమితాబ్-రేఖలను ఉదాహరణగా చూపించిన పృథ్వీరాజ్
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!