భార్యాభర్తల పోరుని వినోదాత్మకంగా చూపించిన ప్రతీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అలాంటి ఫ్యామిలీ కథతో వచ్చే కామెడీ ఎంటర్టైనర్‌లు ఎవర్ గ్రీన్‌గా నిలుస్తుంటాయి. ఇక ఇప్పుడు అలాంటి ఓ కథతోనే ప్రస్తుత తరానికి తగ్గట్టుగా ట్రెండీ మేకింగ్‌తో ‘పురుష:’ అనే చిత్రం రాబోతోంది. బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు ‘పురుష:’ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయం…