డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ “ఇస్మార్ట్ శంకర్”తో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం ఈ ట్యాలెంటెడ్ డైరెక్టర్ విజయ్ దేవరకొండతో కలిసి పాన్ ఇండియా మూవీ “లైగర్”ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. దేవరకొండ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘లైగర్’ను ఆగస్టు 25న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Read Also : Kajal Aggarwal baby shower : పిక్స్ వైరల్
ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా పూరీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను స్వయంగా ప్రకటించాడు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ “జనగణమన”ని పూరి కనెక్ట్స్ హోమ్ ప్రొడక్షన్ బ్యానర్లో చేయబోతున్నాడు. ‘లైగర్’లాగా ‘జనగణమన’ కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ అవుతుంది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే పూరి “జనగణమన” తర్వాత ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ చేయనున్నాడు. ఈ ప్రాజెక్ట్ వివరాలు ప్రస్తుతానికి వెల్లడించనప్పటికీ, అంతర్జాతీయ ప్రాజెక్ట్ కూడా పూరి కనెక్ట్స్ బ్యానర్ పై రూపొందనుంది. ఛార్మి కౌర్‌తో కలిసి పూరి జగన్నాధ్ ఈ సినిమాలన్నింటినీ నిర్మించనున్నారు. ఈ రెండు ప్రాజెక్ట్‌ల స్క్రిప్ట్ వర్క్స్ పూర్తి చేయడంపై పూరి జగన్నాధ్ దృష్టి పెట్టారు.