Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Puneet Raj Kumar Family Relative Vijay Raghavendra Wife Spandana Passes Away Due To Heart Attack

Spandana Death: పునీత్ రాజ్ కుమార్ కుటుంబంలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో మరొకరు మృతి!

Published Date :August 7, 2023 , 3:34 pm
By NTV WebDesk
Spandana Death: పునీత్ రాజ్ కుమార్ కుటుంబంలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో మరొకరు మృతి!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Raj Kumar Family Relative spandana vijay raghavendra died: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. శాండల్‌వుడ్ నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన అనూహ్య పరిస్థితుల్లో కన్నుమూశారు. స్పందన బ్యాంకాక్ పర్యటనలో ఉండగా గుండెపోటుకు గురవడంతో అక్కడే ఆమె మరణించింది. విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు అక్కడికి పయనమయ్యారు. స్పందనకు గుండెపోటు వచ్చి మరణించడంతో ఆమె భౌతికకాయం మంగళవారం బెంగళూరుకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి ఆమెకు గుండెపోటు రావడంతో వచ్చిన వెంటనే ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే అంతలోనే ఆమె చనిపోయారు. మంగళవారం (ఆగస్టు 8) ఆమె భౌతిక కాయాన్ని బెంగళూరుకు తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. స్పందన తండ్రి బీకే శివరామ్, సోదరుడు రక్షిత్ శివరావు ఇప్పటికే బ్యాంకాక్ వెళ్లిపోయారు. స్పందన తండ్రి బికె శివరామ్ ఒక రిటైర్డ్ పోలీసు అధికారి.

Pushpa Shoot: పుష్పరాజ్ ఆన్ డ్యూటీ.. ఈసారి అస్సలు తగ్గేదేలే

స్పందన & విజయ్ వివాహం
విజయ్ రాఘవేంద్ర -స్పందన 26 ఆగస్టు 2007న వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు శౌర్య అనే కుమారుడు ఉన్నాడు. ఈ కుటుంబంలో, స్పందన మరణం ఒక పిడుగులా వచ్చి పడింది. సినీ రంగ ప్రముఖులు, బంధువులు, స్నేహితులు తమ సంతాపం తెలుపుతున్నారు.

రాజ్ కుమార్ కుటుంబంతో బంధుత్వం
స్వతహాగా నటి కాకపోయినా స్పందన కూడా ఓ సినిమాలో నటించింది. రవిచంద్రన్ తో పాటు విజయ్ రాఘవేంద్ర నటించిన ‘అపూర్వ’లో స్పందన కూడా అతిథి పాత్రలో నటించింది. ఆ సినిమాలో వీరు జంటగా కనిపించారు. అలాగే విజయ్ రాఘవేంద్ర నటించి, దర్శకత్వం వహించిన ‘కిస్మత్’ చిత్రాన్ని కూడా స్పందన నిర్మించింది. స్పందన సోదరుడు రక్షిత్ శివరామ్ కర్ణాటక 2023 విధాన సభ ఎన్నికల్లో బెల్తంగడి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. స్పందన తన సోదరుడి తరపున హోరాహోరీగా ప్రచారం చేసింది. నిజానికి కన్నడ నాట ప్రజలు జేజేలు కొట్టే డా.రాజ్ కుమార్ కుటుంబానికి చెందినదే స్పందన కూడా. కన్నడ కంఠీరవ డా.రాజ్ కుమార్ భార్య పార్వతమ్మ రాజ్‌కుమార్‌ సోదరుడయిన ఎస్‌ఏ చిన్నేగౌడకి స్పందన కోడలు వరుస అవుతుంది. ఇక ఆమె గుండెపోటుతో మృతి చెందడం దురదృష్టకరం అని రాజ్ కుమార్ కుటుంబ అభిమానులు సైతం కామెంట్ చేస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Puneet Raj Kumar
  • Raj Kumar
  • spandana
  • spandana death
  • spandana wife passed away

తాజావార్తలు

  • GT vs RR: ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం..

  • Off The Record : ప్రేమ్ సాగర్ రావులో నిరాశ, నిస్పృహలు పెరిగిపోతున్నాయా?

  • Off The Record: ఇంచార్జ్ కోసం పి.గన్నవరం టీడీపీ కేడర్ ఎదురు చూపులు

  • Instagram Love Tragedy: యువతి ప్రాణం తీసిన ఇన్‌స్టా లవ్‌.. ఎలుకల మందు తాగి..!

  • Off The Record: జనసేన కోసం రంగంలోకి ఐప్యాక్ మాజీ టీం..

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions