Punarnavi: ఉయ్యాలా.. జంపాల చిత్రంతో తెలుగుతెరకు పరిచయం అయిన తెలుగమ్మాయి పునర్నవి భూపాలం. ఈ సినిమా తరువాత అమ్మడికి మంచి అవకాశాలు అయితే వచ్చాయి కానీ, ఆశించినంత విజయాలు మాత్రం అందలేదు. ఇక బిగ్ బాస్ హౌస్ కు వెళ్లి.. అక్కడ సింగర్ రాహుల్ తో అమ్మడు నడిపిన ప్రేమాయణం అంతాఇంతా లేదు. ఇక అక్కడనుంచి వచ్చాకా ఈ చిన్నది వరుస అవకాశాలను అందుకొని మరింత జోష్ పెంచుతుంది అనుకుంటే.. అనారోగ్యం పాలై.. ఇంటికే పరిమితమయ్యింది. ఇక గత కొంతకాలంగా ఈ ముద్దుగుమ్మ సినిమాలకు దూరంగా ఉంటుంది. అయితేనేం.. సోషల్ మీడియా ఉందిగా. నిత్యం సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది.
Ramaprabha: ఆయన హెల్ప్ చేశాడా.. ? ఎవరు చెప్పారు.. నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు
ఇక ఈ మధ్యనే పున్నూ పాప.. తన బర్త్ డే వేడుకలను స్నేహితులతో గ్రాండ్ గా జరుపుకుంది. ఆ బర్త్ డే బ్లాష్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. అన్ని ఫొటోలు బాగానే ఉన్నాయి కానీ, అందరి కళ్లు ఒక్క ఫోటోమీదనే ఆగిపోయాయి. పాప.. ట్యాలెంట్ చూపిస్తుంది. అదేనండి.. అందాల ఆరబోత చేస్తూ కనిపించింది. చేతిలో వైన్ గ్లాస్.. చేతికి టాటూస్.. క్లివేజ్ షో తో మతి పోగెట్టేసింది. ఒక్క నిమిషం మన పున్నూనేనా అన్న అనుమానం రాకమానదు. ఖచ్చితంగా ఆ పాపనే అని తెలిసాకా.. కుర్రాళ్ళు కిరెక్కిపోతున్నారు. పున్నూ.. ఏం చూపిస్తున్నావ్.. అస్సలు ఉహించలేదే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ రేంజ్ గా అందాల ఆరబోత స్టార్ట్ చేశావ్.. మళ్లీ ఏ సినిమా లో కనిపిస్తున్నావు ఏంటి..? అంటూ అడిగేస్తున్నారు. మరి ముందు.. ముందు ఈ భామ ఎలాంటి సినిమాలతో రీఎంట్రీ ఇస్తుందో చూడాలి.