Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Ps Mitran Talking About Sardar Movie

PS Mitran: అన్ని రుచులున్న విందు భోజనం లాంటి సినిమా ‘సర్దార్’

Published Date :October 18, 2022 , 5:44 pm
By phani kandukuri
PS Mitran: అన్ని రుచులున్న విందు భోజనం లాంటి సినిమా ‘సర్దార్’
  • Follow Us :
  • google news
  • dailyhunt

PS Mitran: హీరో కార్తి, అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పిఎస్ మిత్రన్ కాంబినేషన్ లో ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్’. రాశి ఖన్నా , రజిషా విజయన్ కథానాయికలు. దీపావళి కానుకగా అక్టోబర్ 21న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదలౌతుంది. కింగ్ అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలలో భారీగా విడుదల చేస్తోంది. ఈ నేపధ్యంలో చిత్ర దర్శకుడు పిఎస్ మిత్రన్ విలేఖరుల సమావేశంలో ‘సర్దార్’ విశేషాలని పంచుకున్నారు.

‘సర్దార్’ చిత్రం ఎలా మొదలైయింది ?

Also Read

  • Paranormal Activity: పెట్టింది రూ.12 లక్షలు.. కొల్లగొట్టింది రూ.16 వేల కోట్లు! సినిమా చరిత్రలోనే అతిపెద్ద మిరాకిల్..
  • Yash Toxic: 4 ఏళ్ల తర్వాత థియేటర్స్‌లోకి రాబోతున్న రాకింగ్ స్టార్.. యష్ 'టాక్సిక్' రిలీజ్‌ అప్పుడేనా?
  • Payal Rajput Lover హీరోగా సినిమా.. ఆరోజే రిలీజ్
  • JD Chakravarthy: అదే మలయాళ సినిమాలు మనవాళ్లు తీస్తే చూడరు.. జేడీ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు!

నా తొలి చిత్రం ‘అభిమన్యుడు’ డబ్బింగ్ చేస్తున్నపుడే సర్దార్ ఐడియా వచ్చింది. నా రచయితల్లో ఒకరితో ఆలోచన పంచుకొని దాన్ని డెవలప్ చేశాం. నిర్మాత లక్ష్మణ్ గారికి ఈ కథ చెప్పాను. ఆయన కార్తి గారిని కలవమన్నారు. కార్తి గారికి ‘సర్దార్’ ఐడియా చాలా నచ్చింది. మరో ఆలోచన లేకుండా ఈ సినిమా తప్పకుండా చేస్తున్నామని చెప్పారు.

‘సర్దార్’ ట్రైలర్ చూస్తుంటే పిరియడ్ సినిమాలా అనిపిస్తోంది.. కథ ఏ కాలంలో వుండబోతుంది ?

వర్తమాన కాలంలో పాటు 1980లో నడిచే కథ ఇది. 1980 లో ఇండియన్ ఇంటలిజెన్స్ ఒక స్పై (గూఢచారి) ని తయారుచేయాలని ప్రయత్నించింది. అయితే సైన్యంలో పని చేసే వ్యక్తిని గూఢచారిగా మార్చడం అంత సులువు కాదు. గూఢచారికి నటించడం రావాలి, మారువేషాలు వేయడం తెలియాలి. దీనికి బదులు ఒక ఒక రంగస్థల నటుడిని గూఢచారిగా మార్చారు. ఇది యదార్ధంగా జరిగింది. ఈ సంఘటన సర్దార్ కథకు ఒక స్ఫూర్తి. అలాగని ఇది పూర్తిగా యాదార్ధకథ కాదు. కొన్ని యదార్ధ సంఘటనలు స్ఫూర్తితో చేసిన కథ.

ట్రైలర్ లో కార్తి రెండు పాత్రలలో కనిపిస్తున్నారు కదా.. దాని గురించి ?

ఇందులో కార్తి పాత్ర చాలా సర్ ప్రైజింగా వుంటుంది. కార్తి ఇందులో రెండు భిన్నమైన పాత్రలలో తండ్రి కొడుకులుగా కనిపిస్తారు. ఒకరి పాత్రకు మరొకరి పాత్రకి పూర్తి వైవిధ్యం వుంటుంది. గూఢచారి పాత్ర ఎలాంటి గుర్తింపుని కోరుకోదు, తన ఉనికి గురించే బయట ప్రపంచానికి తెలీదు. మరో పాత్ర ప్రతి చిన్నదానికి పబ్లిసిటీని కోరుకుంటుంది. ఈ పాత్రలు రెండూ తెరపై చూడటానికి చాలా ఆసక్తికరంగా వుంటాయి.

కార్తితో పని చేయడం ఎలా అనిపించింది ?

నేను ఇప్పటివరకూ పని చేసిన నటుల్లో కార్తి ది బెస్ట్. తన పాత్ర పట్ల చాలా అంకిత భావంతో పని చేస్తారు. సినిమాకి ఉపయోగపడే చాలా ఆలోచలని పంచుకుంటారు. ఆయన తాజా చిత్రం పిఎస్ 1 ఘన విజయం సాధించింది. సర్దార్ ఈ విజయాన్ని కొనసాగిస్తుందని నమ్ముతున్నాను.

కార్తి చాలా వైవిధ్యమైన సినిమాలు చేసినప్పటికీ ఆయన చిత్రాల్లో వినోదం వుంటుంది. మరి సర్దార్ ఎలా వుండబోతుంది ?

సర్దార్ అన్నీ రుచులు గల ఫుల్ మీల్స్ లాంటి సినిమా. లవ్, కామెడీ, యాక్షన్, బలమైన ఎమోషన్, సోషల్ కాన్సెప్ట్ వున్న సినిమా ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తుంది.

రాశి ఖన్నా , రజిషా విజయన్ పాత్రలు గురించి ?

రాశి ఖన్నా , రజిషా విజయన్ పాత్రలు కథలో చాలా కీలకంగా వుంటాయి. వారి పాత్రలని అద్భుతంగా చేశారు. అలాగే ఈ చిత్రంలో లైలా పాత్ర కూడా చాలా ఆసక్తికరంగా వుంటుంది.

జీవి ప్రకాష్ కుమార్ సంగీతం గురించి ?

జీవి ప్రకాష్ కుమార్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఆయన బెస్ట్ స్కోర్స్ లో సర్దార్ ఒకటి. కథకు తగ్గ పాటలని చాలా ఎక్స్ టార్డినరీగా చేశారు. నేపద్య సంగీతం కూడా బ్రిలియంట్ గా వుంటుంది.

దీపావళికి చాలా సినిమాలు పోటి పడుతున్నాయి. తమిళ్ లో శివకార్తికేయన్ సినిమా కూడా వుంది. ఎలా అనిపిస్తుంది ?

గతంలో నేను శివకార్తికేయన్ సినిమా చేసినప్పుడు అది కార్తి సినిమాతో పాటుగా విడుదలైయింది. ఇప్పుడు కార్తి సినిమాతో పాటు శివకార్తికేయన్ సినిమా విడుదలౌతుంది. గమ్మత్తుగా రెండు సార్లు నా హీరోలతోనే నా సినిమాలు ఒకేసారి వచ్చాయి.(నవ్వుతూ). అయితే రెండు డిఫరెంట్ చిత్రాలు. దేనికదే ప్రత్యేకమైనవి. దీపావళికి వస్తున్న అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్స్ కావాలని కోరుకుంటున్నాను.

నాగార్జున గారి అన్నపూర్ణ స్టూడియోస్ సర్దార్ ని తెలుగులో విడుదల చేయడం ఎలా అనిపిస్తుంది ?

అన్నపూర్ణ స్టూడియోస్ నా ఫేవరేట్ ప్రొడక్షన్ హౌస్. నాగార్జున గారి ఆతిధ్యం అద్భుతంగా వుంటుంది. నాగార్జున గారికి కార్తికి మంచి అనుబంధం వుంది. వారిద్దరూ కలసి ఊపిరి లాంటి అద్భుతమైన సినిమా చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ సర్దార్ ని తెలుగు విడుదల చేయడం గొప్పగా, అనందంగా వుంది.

కొత్తగా చేయబోయే సినిమాలు గురించి ?

అఖిల్ తో ఒక సినిమా చేసే ఆలోచన ఎప్పటి నుండో వుంది. అయితే ప్రస్తుతానికి నా దృష్టి సర్దార్ విడుదల పైనే వుంది.

ఆల్ ది బెస్ట్

థాంక్స్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Karthi
  • Kollywood News
  • ps mitran
  • Sardar

తాజావార్తలు

  • KTR: రంగుల సినిమా చూపించి రేవంత్ అధికారంలోకి వచ్చాడు

  • Vivo T5x 5G: భారీగా తగ్గిన వివో T5x 5G ధర.. 50MP Sony కెమెరా + 120Hz డిస్‌ప్లే + 7200mAh

  • Donald Trump: ఎఫ్‌బీఐ చీఫ్ కాష్ పటేల్‌‌ను టార్గెట్ చేసిన ట్రంప్..!

  • Top 3 Scooters: 51 లక్షల యూనిట్ల అమ్మకాలు.. జనం ఎగబడి కొంటున్న టాప్ 3 స్కూటర్లు ఇవే.. ధరలు, మైలేజ్ & ఫీచర్లు

  • Paranormal Activity: పెట్టింది రూ.12 లక్షలు.. కొల్లగొట్టింది రూ.16 వేల కోట్లు! సినిమా చరిత్రలోనే అతిపెద్ద మిరాకిల్..

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions