కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో… స్టూడెంట్ లైఫ్ లో ఉండే ఫన్, స్టూడెంట్స్ చేసే అల్లరిని చూపిస్తూ సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి ఒక సినిమా రాబోతుంది. టైటిల్ లోనే మ్యాడ్నెస్ ని పెట్టుకోని ‘మ్యాడ్’ అనే టైటిల్ తో ఈ సినిమా రిలీజ్ కానుంది. కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రామ్ నితిన్, నార్నే నితిన్, సంగీత్ శోభన్ లు హీరోలుగా నటిస్తుండగా… గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక, గోపిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీళ్లందరూ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ కాలేజ్ లో చేసిన అల్లరే ‘మ్యాడ్’ సినిమా కథ. ఇటీవలే బయటకి వచ్చిన ఈ మూవీ టీజర్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకూ అన్ లిమిటెడ్ ఫన్ ని ఇవ్వడంతో మ్యాడ్ టీజర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. కంప్లీట్ రోలర్ క్యాస్టర్ రైడ్ లా ఉన్న ఈ మూవీ టీజర్ యూత్ ని అట్రాక్ట్ చేసింది. శనివారం, ఆదివారం ఎలాగూ సెలవలే కాబట్టి యూత్ థియేటర్స్ కి వస్తారు, అలాంటి వాళ్లని మండే కూడా కాలేజ్ మాన్పించేలా చేస్తే చాలు సినిమా హిట్ కొట్టినట్లే.
ఈ విషయంలో మ్యాడ్ చిత్ర యూనిట్ టీజర్ తోనే మంచి బజ్ ని జనరేట్ చేసారు, దీన్ని మరింత పెంచుతూ మేకర్స్ మ్యాడ్ మూవీ నుంచి ‘ప్రౌడ్ సి సింగల్’ సాంగ్ ని రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. సెప్టెంబర్ 14న బయటకి రానున్న ఈ సాంగ్ ప్రోమో బయటకి వచ్చింది. భీమ్స్ కంపోజ్ చేసిన జోష్ ఫుల్ ట్యూన్ కి రఘురామ్ రాసిన క్యాచీ లిరిక్స్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. వినగానే యూత్ అంతా హమ్ చేసుకునేలా ఉన్న ఈ సాంగ్ ని నకాష్, భీమ్స్ కలిసి పాడారు. ఈ ఇద్దరి వోకల్స్ ఉన్న ఎనర్జీ… సాంగ్ ని మరింత ఎంటర్టైనింగ్ గా మార్చింది. “ఛాన్స్ దొరికినా మింగిల్ అవ్వకు… ప్రౌడ్ సింగల్ గా ఉండు మావా” అంటూ సాగిన ఈ సాంగ్ ని ఇకపై యూత్ రిపీట్ మోడ్ లో పాడుకోవడం గ్యారెంటీ.
A Maddest & Crazy Singles Anthem is coming your way! 😎
Here’s #ProudSeSingle song promo from #MADTheMovie 🤩
Full Song out on Sept 14th 🕺💃
A #BheemsCeciroleo Musical 🎹
Sung by @AzizNakash
Lyrics by Raghuram@kalyanshankar23 @vamsi84…— Naga Vamsi (@vamsi84) September 12, 2023