పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అంటే నెల రోజుల ముందు నుంచే సోషల్ మీడియాలో హంగామా మొదలవుతుంది, వారం రోజుల ముందు నుంచే థియేటర్స్ దగ్గర రచ్చ షురూ అవుతుంది. ఏ స్టార్ హీరో సినిమాకి అయినా రెండు మూడు రోజుల ముందు నుంచి హంగామా స్టార్ట్ అవుతుంది కానీ పవన్ సినిమాకి మాత్రమే పండగ లాంటి సెలబ్రేషన్స్ ఉంటాయి. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవ్వడం అనేది మెగా ఫాన్స్ కి ఒక ఫెస్టివల్ లాంటిది. దాన్ని ఎంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు అంటే రీరిలీజ్ కి కూడా రికార్డ్స్ బ్రేక్ చేసే అంత. వకీల్ సాబ్ రిలీజ్ సమయంలో పవన్ కళ్యాణ్ ఫాన్స్ చేసిన సంబరాలు, ఇప్పటివరకూ ఏ థియేటర్ దగ్గర చూసి ఉండము. రిలీజ్ రోజున ఆ రేంజ్ హంగామా చేసే ఫాన్స్ ఉన్న అతితక్కువ మంది హీరోల్లో పవన్ ఒకడు. అంత కల్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న పవన్ కళ్యాణ్ సినిమా మరో రెండు వారాల్లో రిలీజ్ అవుతుంది కానీ ఎలాంటి హడావుడి లేదు.
రీమేక్ అవ్వడం, ప్రమోషన్స్ అంతంతమాత్రంగానే సాగడం, సాంగ్ కూడా ఆశించిన రేంజులో లేకపోవడం ‘బ్రో’ సినిమాకి హైప్ లేకపోవడానికి కారణం. జులై 28న బ్రో రిలీజ్ షెడ్యూల్ అయ్యి ఉంది, నిజానికి ఈ పాటికి టీజర్, సాంగ్స్, పంచ్ డైలాగ్స్ తో ప్రమోషన్స్ హోరెత్తాలి కానీ ‘బ్రో’ సినిమా విషయంలో అది జరగట్లేదు. పైగా ఫాన్స్ కూడా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో, పవన్ స్పీచ్ లు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో పవన్ పొలిటికల్ జర్నీగా అండగా నిలిచే మూడ్ లో ఉన్నారు, అందుకే సినిమా రిలీజ్ అవుతున్నా పట్టించుకోకుండా పవన్ పొలిటికల్ క్యాంపెయిన్ పై ద్రుష్టి పెట్టారు. ఇది బ్రో సినిమా ఓపెనింగ్స్ ని దెబ్బ తీసే అవకాశం ఉంది. ప్రొడ్యూసర్స్ వచ్చే రెండు వారాలని అయినా పర్ఫెక్ట్ గా వాడుకోని సాలిడ్ ప్రమోషన్స్ చేస్తే బజ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది, లేదంటే వారాహి యాత్ర చేసే సౌండ్ ముందు ఏ సినిమా సౌండ్ మెగా ఫాన్స్ కి వినిపించదు.