Deepika Pdukone: ‘ప్రాజెక్ట్ కె’ షూటింగ్ లో దీపికా కు అస్వస్థత.. నిర్మాతలు ఏమన్నారంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే స్వల్ప అస్వస్థత గురయ్యింది. ఒక్కసారిగా ఆమెకు హార్ట్ బీట్ పెరగడంతో వెంటనే ఆమెను కామినేని హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని, నోవాటెల్ హోటల్ లో అబ్జర్వేషన్ ఉంచినట్లు వైద్యులు తెలిపారు అంటూ కొద్దిసేపటి నుంచి వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ విషయం తెలియడంతో దీపికా అభిమానులు.. ఆమెకు ఏమైంది అంటూ సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వార్తలపై ప్రాజెక్ట్ కె నిర్మాతలు స్పందించారు.
దీపికా ఆరోగ్యం బాగానే ఉందని, నార్మల్ చెకప్ కోసం మాత్రమే ఆమె హాస్పిటల్ కు వెళ్లినట్లు తెలిపారు. నిజానిజాలు తెలియకుండా వార్తలు రాయవద్దని, ఇలాంటి ఫేక్ వార్తలను అభిమానులు నమ్మవద్దని కూడా చెప్పుకొచ్చారు. దీంతో దీపికా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం దీపికా, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె చిత్రంలో నటిస్తుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది.. ఈ షూటింగ్ కోసం ముంబై నుంచి వచ్చిన దీపికా.. కామినేని హాస్పిటల్ లో నార్మల్ హెల్త్ చెకప్ చేయించుకున్నారు. రేపటి నుంచి ఆమె యధావిధిగా షూటింగ్ లో పాల్గొననున్నారని సమాచారం.
Also Read
- Golmaal 5 Release Date: అజయ్ దేవగన్ ‘గోల్మాల్ 5’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్షయ్ ఎంట్రీతో ఈసారి నవ్వుల మోతే!
- Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
- Varanasi-Mahesh Babu: ఇంకా ఒక వారమే.. మహేష్ బాబు 'వారణాసి' నుంచి క్రేజీ అప్డేట్!
- Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
తాజావార్తలు
-
HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
-
Golmaal 5 Release Date: అజయ్ దేవగన్ ‘గోల్మాల్ 5’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్షయ్ ఎంట్రీతో ఈసారి నవ్వుల మోతే!
-
Abhishek Porel: నెలకు పైగా జైలు జీవితం.. ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్‌కు బెయిల్!
-
Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
-
TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్‌లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!