Tiger Shroff : బాఘీ4 టీజర్.. ఆ సినిమాకు చీప్ కాపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యాక్షన్ ఎంటర్టైన్మెంట్‌కు బాలీవుడ్ అర్థం మార్చేస్తోంది. హీరోయిజానికి కొత్త బాష్యం చెబుతోంది. నలుగురు రౌడీలను హీరో చితకబాదే దగ్గర నుండి పదునైన వెపన్స్‌తో శత్రువుల బాడీని తూట్లు పొడుస్తూ.. రక్తపాతం సృష్టించడమే సినిమాగా చూపిస్తోంది. కమర్షియల్ ఎలిమెంట్స్ మోజులో పడి బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఈ ధోరణీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నార్త్ బెల్ట్‌లో హింసాత్మక చిత్రాల సంఖ్య రానూ రానూ పెరుగుతోంది. ఆ మధ్య వచ్చిన కిల్, యానిమల్ సిల్వర్ స్క్రీన్‌పై అత్యంత బ్లడ్ షెడ్ సృష్టించాయని మాట్లాడుకుంటే.. ఇప్పుడు వీటిని మించిపోయేలా కనిపిస్తోంది బాఘీ4.
టైగర్ ష్రాఫ్ సినిమాలంటే యాక్షన్, డ్యాన్స్ మూమెంట్స్ లేకుండా ఊహించలేం. కానీ ఈసారి బాఘీ4లో బ్రూటల్ మర్డరర్‌గా మారిపోయాడు. పదునైన వెపన్స్‌తో విలన్స్‌ను వేటాడుతున్నాడు. హీరో మాత్రమే రక్తపాతం ఎందుకు సృష్టించాలనుకున్నాడేమో సౌత్ డైరెక్టర్ హర్ష.. యాంటోగనిస్టు, హీరోయిన్లు సోనమ్ బజ్వా, హర్న సంధుతో కూడా కత్తి పట్టించి.. స్క్రీన్ మొత్తాన్ని రక్తంతో తడిపేశాడు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు యానిమల్ ని చూసి కేవలం వైలెన్స్ ఉంటె సినిమాలు ఆడేస్తాయనుకుంటున్నారు. బాఘీ 4 టీజర్ చూడటానికే ఎంత జుగుప్సాకరంగా ఉందంటే యానిమల్ సినిమాకి చీప్ కాపీలాగా ఉందని చెప్పొచ్చు. ఇక ట్రైలర్, మూవీని ఏ లెవల్లో బ్లడ్‌తో తడిపేయబోతున్నారో అనే డౌట్ కలుగుతోంది. సెప్టెంబర్ 5న రిలీజ్ కాబోతున్న ఈ సినిమతో సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారో సదరు మేకర్స్. అన్నట్టు ఈసినిమాకు దర్శకుడు హర్ష గతేడాది గోపిచంద్‌తో భీమా తీసి ప్లాప్ ఇచ్చాడు.
Also Read
- The Odyssey: రిలీజ్‌కు ముందే సెన్సేషన్.. హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్న 'ది ఒడిస్సీ' టికెట్లు! లక్షకు పైగా..
- Kiran Abbavaram: 'మా తమిళోల్లు మీ సినిమాలు చూడరు..' ఉన్న విషయం చెప్పిన హీరో కిరణ్ అబ్బవరం
- Vallabhaneni Anil: చిరంజీవి చెప్పిన మాటతో కదిలిన ఫెడరేషన్.. డ్యాన్స్ మాస్టర్స్ గొడవకు ఫుల్ స్టాప్?
- Posani Krishna Murali: 'లవ్ యూ రాజా' డైలాగ్ వెనుక అసలు కథ ఇదే.. అసలు విషయం చెప్పిన పోసాని
తాజావార్తలు
-
CM Revanth Reddy : సీఎం రేవంత్ బిగ్ ప్లాన్.. స్పోర్ట్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలి మేకోవర్.!
-
Sodium Metal Battery Breakthrough: కేవలం 4 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్.. శాస్త్రవేత్తల సంచలన పరిశోధన..
-
RBI Rule: బ్యాంక్ పొరపాటు వల్ల మీకు నష్టం జరిగిందా..? రూ.33 లక్షల పరిహారం పొందండిలా..
-
The Odyssey: రిలీజ్‌కు ముందే సెన్సేషన్.. హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్న ‘ది ఒడిస్సీ’ టికెట్లు! లక్షకు పైగా..
-
Local Governance : గ్రామ పంచాయతీలకు బంపర్ పవర్.. సొంత ఆదాయంపై పూర్తి హక్కు.!
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!