Site icon NTV Telugu

Producers : ఆ విలక్షణ నటుడి కోసం కోట్లు కుమ్మరిస్తున్న నిర్మాతలు

Sj Surya

Sj Surya

వరుస హిట్స్‌తో యస్‌జెసూర్య టాప్‌ ఛైర్‌కు పోటీపడుతున్నాడు. పవన్‌తో ఖుషీ, కొమరం పులి, మహేశ్‌తో నాని తీసిన యస్‌జె సూర్య యాక్టర్‌గా బిజీ అయిపోయాడు. ఏ క్యారెక్టర్‌ ఇచ్చినా జీవించేయడంతో ఎంత అడిగితే అంత ఇచ్చేందుకు రెడీ గా ఉన్నారు నిర్మాతలు. అటు తమిళ్ లోనే కాదు తెలుగులోను అదరగోతున్నాడు యస్‌జెసూర్య.నేచురల్ స్టార్ నాని నటించిన  ‘సరిపోదా శనివారం’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. సినిమా సక్సెస్‌ మీట్‌లో నాని ఏకంగా యస్‌జె సూర్యను హీరోని చేసేశాడు.

Also Read : Tollywood : బ్రేకప్ తర్వాత దూసుకెళ్తోన్న ముద్దుగుమ్మలు

తమిళ్ హీరో విశాల్‌ ఎన్నో ఫ్లాపుల తర్వాత యస్‌జె సూర్యతో కలిసి నటించిన మార్క్‌ ఆంటోనితో రూ. 100 కోట్లు చూశాడు. జిగర్తాండ2లో యస్‌జె సూర్య పెర్‌ఫార్మెన్స్‌ గురించి ఎంత చెప్పిన తక్కువే. సూర్య సినిమాలో వుంటే చాలు క్యారెక్టర్‌ హైలైట్‌ అవుతోంది. ఆమధ్య రిలీజైన విక్రమ్‌ ‘వీర ధీర శూర’లో యస్‌జె సూర్య క్యారెక్టర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. 10 ఏళ్లుగా మెగా ఫోన్‌ పట్టకపోయినా యాక్టర్‌గా టాప్‌ పొజిషన్‌కు చేరాడు యస్‌జె సూర్య. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా విలన్‌గా యస్‌జె సూర్య ఫుల్‌ డిమాండ్‌లో వున్నాడు. దీనితోపాటే రెమ్యునరేషన్‌ కూడా పెరిగిపోయి రూ. 10 కోట్లకు చేరింది. ఈమధ్యకాలంలో యస్‌జె సూర్యకొచ్చిన క్రేజ్‌ను క్యాష్‌ చేసుకుంటూ సర్దార్‌2 స్పెషల్‌ వీడియోలో యస్‌జె సూర్యను హైలైట్‌ చేశాడు దర్శకుడు. కథ బలం ఉన్న పాత్ర, హీరోను ఢీ అంటే ఢీ వంటి క్యారక్టర్ అనగానే దర్శకులకు ముందుగా గుర్తొచ్చేది యస్‌జెసూర్య మ్యాత్రమే. అయితే దర్శకులు పెట్టుకున్న నమ్మకాన్ని ఆంటే స్థాయిలో నిలబెట్టి సినిమాల విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు ఈ విలక్షణ నటుడు.

Exit mobile version