Tollywood : బ్రేకప్ తర్వాత దూసుకెళ్తోన్న ముద్దుగుమ్మలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమన్నా, విజయ్ వర్మ పెళ్లి చేసుకోకపోయినా. మూడేళ్ల నుంచి భార్యాభర్తల్లాగానే కలిసి మెలిసి తిరిగారు. మిల్కీ బ్యూటీ ఎక్కడువెళ్లినా ప్రియుడిని తీసుకెళ్లింది. అయితే రెండు నెలల నుంచి తమన్నా సోలోగా కనిపించడంతో బ్రేకప్ రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఇగోలు డామినేషన్స్ వున్నట్టుండి క్లాష్ కావడంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారట. లవర్స్‌తో విడిపోయిన తర్వాతే చాలామంది ముద్దుగుమ్మల కెరీర్ దూసుకుపోయింది. మూడేళ్లుగా విజయ్ వర్మ ప్రేమలో విహరించి రీసెంట్‌గా బ్రేకప్ చెప్పేసింది. ఇక నుంచైనా కెరీర్‌పై కేర్ పెట్టి మళ్లీ టాప్ పొజిషన్‌కు వెళ్ళాలి. బ్రేకప్ తర్వాత ముద్దుగుమ్మల సుడి తిరిగినట్టు. ఈ అమ్మడుకు కూడా ఆ జాబితాలో చేరుతుందేమో చూడాలి మరి.
ఇక శృతిహాసన్ అయితే డేటింగ్‌లో పడి కెరీర్‌ను పక్కన పెట్టేసింది. డూడిల్ ఆర్టిస్ట్ సతాను హజారికాతో మూడేళ్ల డేటింగ్ తర్వాత గుడ్‌బై చెప్పేసింది. దీనికి ముందు కూడా సిద్దు అనే ఓ అబ్బాయిని ప్రేమించి కమల్‌కు కూడా పరిచయం చేసింది. ఇంకేముంది పెద్దల అంగీకారంతో పెళ్లి కూడా చేసుకుంటారనుకున్నారంతా. సిద్దుతో మొదలైన ప్రేమకథను సీక్వెల్స్ వారీగా నడిపించింది. ప్రస్తుతం సోలోగా వున్న శృతి బ్రేకప్ తర్వాతే రజనీకాంత్ కూలీ ఛాన్స్ అందుకోవడమేకాదు చేతినిండా సినిమాలతో బిజీగా వుంది.
Also Read
రష్మిక ప్రస్తుతం విజయ్‌దేవరకొండ ప్రేమలో వుందంటూ వార్తలు వస్తున్నా కెరీర్ తొలి నాళ్లల్లోనే ఈ అమ్మడికి బ్రేకప్ స్టోరీ వుంది. డెబ్యూ మూవీ ‘కిరాక్ పార్టీ’తోనే హీరో రక్షిత్ శెట్టి ప్రేమలో పడింది. ఇక పెళ్లే తరువాయి అన్నట్టు ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ లవ్‌స్టోరీకి బ్రేకప్ పడింది. ఆతర్వాత తక్కువ టైంలోనే స్టార్‌గా ఎదిగి పాన్ ఇండియా హీరోయిన్‌గా ఊహించని స్టార్‌డమ్ సొంతం చేసుకుంది రష్మిక. ఇలా బ్రేకప్ తర్వాత ఈ ముద్దుగుమ్మలు కెరీర్ లోస్టార్ గా ఎదుగుతూ దూసుకెళ్తున్నారు.
తాజావార్తలు
-
Attahaasam : వెంకటేష్ మహా కమర్షియల్ సినిమా అట్టహాసం.. హిట్టు కొడతాడో లేదో
-
Mandhana-Harmanpreet: హర్మన్‌ప్రీత్, మంధాన మధ్య విభేదాలు.. రెండుగా విడిపోయిన భారత డ్రెస్సింగ్ రూమ్?
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
ట్రెండింగ్
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్‌ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!