Producer Shravya Varma Announces Engagement with Srikanth Kidambi: రామ్ గోపాల్ వర్మ మేనకోడలు తెలుగు సినీ సెలబ్రిటీ స్టైలిస్ట్ సినీ కాస్ట్యూమ్ డిజైనర్ శ్రావ్య వర్మ ప్రేమలో పడింది. ఈ విషయాన్ని ఆమె ప్రియుడు బ్యాడ్మింటన్, క్రీడాకారుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత కిదాంబి శ్రీకాంత్ అధికారికంగా వెల్లడించాడు. ఈ మేరకు ఇద్దరు కలిసి ఉన్న ఒక ఫోటోను షేర్ చేస్తూ ఆమె ఎస్ చెప్పింది మేమిద్దరం కలిసి ఒక అంతులేని కథను రాసేందుకు సిద్ధమవుతున్నాం అంటూ పోస్ట్ చేశాడు. శ్రావ్య వర్మ తెలుగులో అనేక సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరించింది. ముఖ్యంగా ఆమెను తన మేనకోడలిగా రామ్ గోపాల్ వర్మ పరిచయం చేశాడు.
Biju Menon : శివకార్తికేయన్ సినిమాలో బిజు మీనన్
శ్రావ్య వర్మ ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ పరిశీలిస్తే ఆమె అనేకమంది టాలీవుడ్ సెలబ్రిటీలకు స్టైలిస్ట్ గా పని చేసినట్లు అర్థమవుతుంది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ, అక్కినేని నాగార్జున, వైష్ణవ్ తేజ్, విక్రమ్ లకు కొన్ని డ్రెస్సులు డిజైన్ చేసింది. అదేవిధంగా ప్రస్తుతం రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకి ఆమె కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరిస్తోంది. ఆమె కేవలం వీరికి మాత్రమే కాదు అనేక సినిమాలకు కూడా పని చేసినట్లు చెబుతున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆమె నిర్మాతగా మారి గుడ్ లక్ సఖి అనే సినిమాకి సహ నిర్మాతగా వ్యవహరించింది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా పెద్దగా వర్కౌట్ అవలేదు. ఇక కిదాంబి శ్రీకాంత్ కి పెద్దగా పరిచయమే అక్కర్లేదు క్రీడా లోకం అంతటికీ ఆయన ఎంత టాలెంటెడ్ ప్లేయర్ అనేది సుపరిచితమే.